'అల్ట్రావయోలెట్' బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ.
ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ బైక్ F77.
ఎఫ్77 ఎడిషన్ 10.3 కిలోవాట్ వాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండి కేవలం ఒక ఛార్జ్ తో 307 కిమీ అందిస్తుంది.
ఈ బైక్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 60 కిమీ మరియు 7.8 సెకన్లలో 100 కిమీ వరకు వెళుతుంది.
ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 60 కిమీ వేగవంతం అవుతుంది.
దీని బేస్ వేరియంట్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండి 207 కిమీ పరిధిని అందిస్తుంది.
F77 నెక్స్ట్ లెవెల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అని చెప్పుకోవచ్చు.
ఇది అంతర్జాతీయ మోటార్‌సైకిల్ విభాగాన్ని ఎలక్ట్రిఫై చేయటానికి ఉద్దేశించిన భారతదేశ చాతుర్యానికి చిహ్నం.
ఈ ఎలక్ట్రిక్ బైక్ మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి అల్ట్రావయోలెట్ ఎఫ్77, ఎఫ్77 రీకాన్ మరియు ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్.
వీటి ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా రూ.3.80 లక్షలు, రూ.4.55 లక్షలు మరియు రూ. 5.50 లక్షలు.