భారతదేశపు మొట్టమొదటి దేశీ కంపెనీ కైనెటిక్ లూనాని ఎలక్ట్రిక్ రూపంలో తీసుకువచ్చింది. మొత్తం 2 వేరియంట్లలో ఇది లభిస్తుంది.

సరికొత్త కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా భారత మార్కెట్లో లాంచ్ అయింది. ప్రజలకు మరింత చేరువవ్వాలనే లక్ష్యంతో ఈ లూనాను రూపకల్పన చేశారు. 

ఈ వెహికల్ 1.7 kWh, 2 kWh, 3 kWh బ్యాటరీ ప్యాక్‌లతో, మల్టిపుల్ వేరియంట్‌లలో లభిస్తుంది. సింగిల్ ఛార్జ్‌ తో 150 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

కైనెటిక్ గ్రీన్ సంస్థ ఈ ఎలక్ట్రిక్ లూనాను రూపొందించటం జరిగింది. దీని   తయారీ పూర్తిగా  భారతదేశంలోనే జరిగింది. 

ఈ ఎలక్ట్రిక్ లూనా మోడల్ 150 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉండటం చేత హెవీ డ్యూటీ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ లూనా మూడు బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మరియు బ్యాటరీ స్వాపింగ్ కి వీలు కల్పిస్తుంది. 

కొత్త ఇ-లూనా గరిష్ట వేగం గంటకు 50 కిమీలు. బ్యాటరీ, మోటార్ మరియు కంట్రోలర్ అన్నీ IP67 రేటింగ్‌తో వాటర్, డస్ట్ ప్రూఫ్.  

ఈ మోపెడ్ 16-ఇంచెస్ వైర్-స్పోక్ వీల్స్‌పై నడుస్తుంది. స్పీడ్ కంట్రోల్ కోసం రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. 

ఇందులో కాంబి-బ్రేకింగ్, USB ఛార్జింగ్ పోర్ట్, మూడు రైడింగ్ మోడ్‌లు, సైడ్-స్టాండ్ సెన్సార్ వంటి అనేక ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. 

ఈ కైనెటిక్ గ్రీన్ ఇ-లూనా ఓషన్ బ్లూ, మల్బరీ రెడ్, పెర్ల్ ఎల్లో, స్పార్క్లింగ్  గ్రీన్ మరియు నైట్ స్టార్ బ్లాక్ అనే ఐదు మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది.