ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాధుని శ్రీ మందిర్ లో ఉన్న రహశ్య గదైన రత్న బాండాగారం త్వరలో తెరుచుకోనుంది.
నలభై ఆరు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జులై 14న ఈ రహశ్య గదిని తెరవాలని ఒడిసా గవర్నమెంట్ నిర్ణయించుకొంది.
46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పటి నుంచి మూసి ఉన్న రహస్యగదిని మళ్లీ ఇప్పుడు అంటే 2024లో తెరవాలని నిర్ణయించుకొన్నారు.
గతంలో ఈ గదిని తెరవాలనుకొన్నప్పుడు ఆ గది తాళాలు మిస్సయ్యాయి. అందుకే ఈసారి డూప్లికేట్ తాళాన్ని ఉపయోగించి కానీ, లేదంటే తాళాన్ని పగులగొట్టైనా సరే ఈ గదిని తెరవాలనుకొన్నారు.
దశాబ్దాలుగా ఈ రహస్యగదిలో ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు, కెంపులు, పచ్చలు, గోమేధిక, పుష్యరాగాలు వంటివి నిక్షిప్తమై ఉన్నాయి.
వాటన్నిటినీ ఇప్పుడు బయటకి తీసి, రత్న భాండాగారానికి కొన్ని మరమ్మతులు కూడా చేపట్టాలని నిర్ణయించుకొన్నారు.
అయితే, ఈ రహశ్య గదిని ఓపెన్ చేయాలంటే అనేక సవాళ్ళతో కూడుకొన్న పని. దశాబ్దాలుగా ఎవరూ ఆ సాహసాన్ని చేయలేక పోతున్నారు.
ఈ రహశ్య గది తలుపులు తెరిస్తే, ఊహించని విపత్తులు తలెత్తే అవకాశం ఉందని, అది దేశానికి అరిష్టమని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు.
కానీ, ఆర్కియాలజిస్టులు మాత్రం సంపద లెక్కింపు తప్పనిసరి అని అందుకోసం ఎలాగైనా గది తలుపులు తెరవాలని పట్టుపట్టారు.
మొత్తం మీద ప్రభుత్వం ఈ ఏడాది రత్న భండార్ ని తెరవటానికే ఫిక్స్ అయింది. మరి ఏం జరగబోతుందో వేచి చూడాలి.