చైనాకి చెందిన షియోమి కంపెనీ తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రిక్ వెహికల్ షియోమి స్పీడ్ అల్ట్రా 7 (Xiaomi SU7).

ఈ-మోటర్‌, షియామీ డై-క్యాస్టింగ్‌, షియామీ పైలట్‌ అటానమస్‌ డ్రైవింగ్‌, సీటీబీ ఇంటిగ్రేటెడ్‌ బ్యాటరీ, స్మార్ట్‌ క్యాబిన్‌ వంటి 5 ఈవీ టెక్నాలజీలతో ఈ కారు రూపొందించబడింది.

సింగిల్‌ చార్జ్‌తో 668 కిలోమీటర్లు, మరియు 800 కిలోమీటర్లు ప్రయాణించేలా రెండు రకాల కార్లని అందుబాటులోకి తెచ్చింది.

ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 265 కిలోమీటర్లు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.78 సెకండ్లలోనే అందుకోగలదు. 

ఈ ఈవీ కారులో మొత్తం 16 యాక్టీవ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 16.1 అంగుళాలకే అల్ట్రా-క్లియర్‌ సెంట్రల్‌ కంట్రోల్‌ స్క్రీన్‌. 56 అంగుళాల భారీ హెచ్‌యూడీ.

షియామీ ట్యాబ్లెట్లను కనెక్ట్‌ చేసుకునే సౌకర్యం. ఇలా కారులో మొత్తం 5-స్క్రీన్స్‌ను అనుసంధానంమై ఉన్నాయి.

ఈ కారు ప్రారంభ ధర 30 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 25 లక్షలు.  ఇది చైనాలో టెస్లా మోడల్‌ 3 ప్రారంభ ధర కన్నా 4 వేల డాలర్లు తక్కువ 

భవిష్యత్‌లో మరిన్ని రంగాల్లో బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలని ప్లాన్ చేసుకున్న షియోమి కంపెనీ ఇండియన్ మార్కెట్‌ ని వేదికగా చేసుకొంది.

ప్రస్తుతానికైతే ఇండియాలో షావోమికి స్మార్ట్‌ఫోన్‌ల బిజినెస్‌ బానే కొనసాగుతుంది. భవిష్యత్‌లో మిగతా ప్రొడక్ట్స్‌కి కూడా ఇదే స్థాయిలో డిమాండ్ తెచ్చుకోవాలని ఆసక్తి చూపుతోంది.

మార్కెట్‌లోకి లాంచ్ అవగానే చైనాలో 24 గంటల్లోనే లక్ష ఆర్డర్లు వచ్చాయి. మరి భారత్ లో ఎలా ఉంటుందో చూడాలి.