సెన్సిటివ్ ప్లాంట్ ఆకులు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని తాకినప్పుడు కొన్ని సెకన్లలోనే ముడుచుకు పోతాయి. ఈ ప్రవర్తనను "సీస్మోనాస్టీ" అని పిలుస్తారు.
వీనస్ ఫ్లైట్రాప్ అనేది మాంసాహార మొక్క. ఇది అవసరమైన పోషకాలను పొందేందుకు కీటకాలను దానిలోకి లాగేసుకుని తినేస్తుంది. దీని ఆకులు కేవలం 0.1 సెకన్లలోనే మూసివేయబడతాయి.
పిచ్చర్ ప్లాంట్స్ మాంసాహార మొక్కలు. ఇవి కీటకాలను ఎట్రాక్ట్ చేయటం కోసం వీటి ఆకులని కీటకాలు తప్పించుకోలేని విధంగా లోతైన, జారే కప్పును ఏర్పరుస్తాయి.
ప్రేయర్ ప్లాంట్ అనేది రాత్రిపూట దాని ఆకులను పైకి మడిచి, ప్రేయర్ చేసే విధంగా చేతులు కట్టుకుని ఉంటుంది. ఈ ప్రవర్తనను "నైక్ట్రోపిజం" అని పిలుస్తారు.
టికిల్ మి ప్లాంట్ స్పర్శకు ప్రతిస్పందించే సున్నితమైన మొక్క. ఈ ప్రవర్తనను "సీస్మోనాస్టీ" అని పిలుస్తారు. వీటిని టచ్ చేయగానే కొన్ని సెకన్లలోనే ముడుచుకు పోతాయి.
కోర్ప్స్ ఫ్లవర్ అనేది అరుదైన మరియు అసాధారణమైన మొక్క. ఇది పుష్పించే సమయంలో, బలమైన, కుళ్ళిన డెడ్ బాడీ వంటి వాసనను వెదజల్లుతుంది.
సన్‌డ్యూస్ మాంసాహార మొక్కలు. వీటి ఆకులు జిగురు లాంటి పదార్ధంతో కప్పబడి ఉంటాయి. ఇవి దగ్గరికి వచ్చిన ఎరను బంధిస్తాయి
బ్లాడర్ వోర్ట్‌లు మాంసాహార మొక్కలు. ఇవి వాక్యూమ్ లాంటి యంత్రాంగాన్ని ఉపయోగించి ఎరను పీల్చుకుని వాటి యొక్క మృదు కణజాలాలను విచ్ఛిన్నం చేస్తాయి.
బటర్‌వోర్ట్‌లు మాంసాహార మొక్కలు. వాటి ఆకులు జిగట బిందువులతో కప్పబడి ఉంటాయి. అవి ఎరను బంధిస్తాయి. తర్వాత కీటకాల యొక్క మృదు కణజాలాలను విచ్ఛిన్నం చేస్తాయి.
కోబ్రా లిల్లీ అనేది మాంసాహార మొక్క. దీని ఆకులు ఒక ప్రత్యేకమైన, నాగుపాము లాంటి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. అందులో ఇది ఎరను బంధిస్తుంది.