వూల్లీ మముత్

సైజులో భారీగా కనిపించే ఈ ప్రాచీన ఏనుగు మంచు యుగంలో జీవించింది. శాస్త్రవేత్తలు దీన్ని DNA క్లోనింగ్‌తో తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

క్యాస్పియన్ టైగర్ 

ఈ పులి మధ్య ఆసియాలో ఎక్కువగా ఉండేది. ఆవాసాలు కోల్పోయిన కారణంగా ఇది అంతరించిపోయినప్పటికీ, దాని DNA తో సేవ్ అయింది.

ప్యాసింజర్ పీజియన్  

ఒకప్పుడు అమెరికాలో లక్షల సంఖ్యలో ఉండే ఈ పావురం ఇప్పుడు కనిపించదు. కాని దాన్ని క్లోనింగ్‌ ద్వారా తిరిగి తీసుకు వస్తున్నారు.

నార్తర్న్ వైట్ రైనో 

ప్రపంచంలో రెండవ అతిపెద్ద భూ జంతువులుగా చెప్పుకొనే  ఈ వైట్ కలర్ రైనోలు (తూర్పు మద్య ఆఫ్రికాలో నివసించేవి. ఇవి ఇంకా పూర్తిగా అంతరించలేదు కానీ జెనటిక్ క్లోనింగ్‌తో సేవ్ అయ్యాయి.  

డోడో 

ఈ అద్భుత పక్షి హిందూ మహాసముద్రంలోని మౌరిషస్ దీవుల్లో ఉండేది. ఇది క్లోనింగ్ ద్వారా తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

పాలియోలక్సొడన్

ఇది ప్లీస్టోసీన్ కాలంలో ఆఫ్రికాలో నివసించే పురాతన భారతీయ ఏనుగు, వూల్లీ మ్యామత్‌కి బంధువు. DNA ఆధారంగా తిరిగి తీసుకురావచ్చు.

టైలసిన్ లేదా టాస్మేనియన్ టైగర్

ఇది ఒక అరుదైన తోడేలు.. కానీ ఒంటిపై పులి చారలు కనిపిస్తాయి... ఆస్ట్రేలియా అడవుల్లో జీవావరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినటంతో దీన్ని తిరిగి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

గ్రేట్ ఆక్  

ఈ పెద్ద నీటి పక్షి ఆర్కిటిక్ సముద్రాల్లో జీవించేది. ఇది ఎగరలేదు, కానీ నీటిలో ఈత కొట్టగలదు. అందుకే ఇది ఎక్కువగా వేటగాళ్ళకి బలైపోయింది. దీనిని  కూడా క్లోనింగ్‌తో మళ్ళీ సృష్టించవచ్చు.

కరోలినా పారాకీట్  

అమెరికాలో కనిపించే ఒక అందమైన పక్షి ఇది, పర్యావరణ కాలుష్యం వల్ల ఇది అంతరించిపోయింది కానీ DNA ఆధారంగా తిరిగి రావచ్చు. 

షార్ట్-ఫేస్డ్ బేర్ 

ఈ భారీ ఎలుగుబంటి ఉత్తర అమెరికాలో ఉండేది. DNA ఆధారంగా శాస్త్రవేత్తలు దీనిని తిరిగి సృష్టించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.