రెడ్ పాండా

భారతదేశం, నేపాల్, చైనా లాంటి హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ జంతువు చిన్నగా, పొడవైన తోకతో, నారింజ రంగులో ఉంటుంది. ఇది చాలా సున్నితమైన జీవి.

బాక్టీరియన్ ఒంటె 

ఈ రెండు కొమ్ముల ఒంటె మంగోలియా, చైనా వ్యాప్తంగా ఉండే ఎడారుల్లో మాత్రమే కనిపిస్తుంది. దీనికి చలిని తట్టుకునే శక్తి ఉంది. ఇదో రేర్ ల్యాండ్ యానిమల్. 

సుమత్రన్ టైగర్ 

ఇండోనేషియాలోని సుమాత్రా దీవులలో మాత్రమే కనిపించే  ఈ పులి, చిన్నదైన శరీరాకృతి కలిగిఉంటుంది. ప్రస్తుతం ఇది అంతరించిపోయే దశలో ఉంది.

జావన్ రైనో  

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో మాత్రమే కనిపించే ఖడ్గమృగం ఇది. వీటిలో చాలావరకూ అంతరించిపోగా, కొద్ది సంఖ్యలో మిగిలిపోయిననవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వీటి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో ఉంది. 

స్నో లియోపార్డ్  

హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ తెల్లని చిరుత పులి, కొండలపై వేటాడుతూ ఉంటుంది. ఇది అతి అరుదైన మరియు అందమైన పెద్ద పిల్లులలో ఒకటి.

సౌలా 

లావోస్ మరియు వియత్నాం అడవుల్లో మాత్రమే కనిపించే ఈ జంతువును “ఆసియా యూనికార్న్” అంటారు. 1992లో దీనిని కనుగొన్నారు. ఇది చాలా అరుదైనది.

ఇండియన్ పంగోలిన్

రాత్రిపూట బయటికి వచ్చే ఈ జీవి శరీరం మొత్తం పొరలతో కప్పబడి ఉంటుంది. ఇది జీవులను చంపి తినే ఓ ప్రత్యేక జీవి. ప్రస్తుతం దీని సంఖ్య తగ్గుతోంది.

గోల్డెన్ లంగూర్ 

భారత్‌ లోని అస్సాం, భూటాన్ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ కోతి గోల్డెన్ కలర్ లో ఉంటుంది. పవిత్రంగా భావించే ఈ జంతువు చాలా అరుదైనది.

మలయన్ తపిర్ 

ఇండోనేషియా, మలేసియా అడవుల్లో మాత్రమే కనిపించే ఈ తపిర్‌కు నలుపు తెలుపు రంగులు ఉంటాయి. ఇది అడవిలో  తేమ ఉండే ప్రాంతాల్లో జీవిస్తుంది.

బర్మీస్ రూఫ్డ్ తాబేలు 

మయన్మార్ నదీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ తాబేలు చాలా రేర్ యానిమల్. ఈ జాతి పునరుత్పత్తికి తీవ్ర భద్రత కల్పిస్తున్నారు.