బయోడైవర్సిటీ
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అగ్నిపర్వతాల కారణంగా ఏర్పడిన ఐలాండ్ గ్రూప్ ని గాలాపాగోస్ అంటారు. ఇక్కడ ఉన్న జీవులలో చాలావరకు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు.
చార్లెస్ డార్విన్ కి ప్రేరణ
ఈ ద్వీపాలని చూశాక డార్విన్‌కి జీవ పరిణామ సిద్ధాంతం ఆలోచన వచ్చిందని చెబుతారు. ఇక్కడి పక్షులు అతనిని ఎంతగానో ప్రభావితం చేశాయి.
మెరైన్ ఇగువానాలు
సముద్ర జీవుల్లో దాదాపు ఐదవ వంతు ఈ దీవులకు చెందినవి. అలాంటి జీవులలో మెరైన్ ఇగువానాలు ఒకటి. ఇవి కాలక్రమేణా పరిష్టితులని బట్టి తమని తాము మార్చుకొంటాయి.
బ్లూ-ఫూటెడ్ బూబీస్ పక్షులు
ఈ పక్షులు ప్రత్యేకించి బ్లూ కలర్ కాళ్లను కలిగి ఉంటాయి. మేటింగ్ సమయంలో ఇవి డాన్స్ చేస్తూ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.
వాల్కేనోల నుండి ఏర్పడిన ఐలాండ్స్
గాలాపాగోస్ ద్వీపాలు మొత్తం అగ్నిపర్వత పేలుళ్ల వల్ల ఏర్పడ్డవే. ఇక్కడి అగ్ని పర్వతాలు ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయి.
జెయింట్ టార్టాయిస్‌లు
ఇక్కడి భారీ తాబేళ్లు కొన్ని దశాబ్దాల పాటు జీవించగలవు. మరి కొన్ని టార్టాయిస్‌లైతే 100 సంవత్సరాలకు పైగా జీవించాయి.
కాలానుగుణంగా మారిన జీవులు
ఇక్కడి జంతువులు తమ పరిసరాలకు అనుగుణంగా కొన్ని వేల సంవత్సరాల్లోనే మార్పులు చెందాయి. ఇది డార్విన్ థియరీ అఫ్ ఎవల్యూషన్ కి దారి తీసింది.
యునెస్కో వారసత్వ ప్రదేశం
గాలాపాగోస్ ద్వీపాలు 1978లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి. ఇది ప్రపంచ ప్రాముఖ్యతను తెలియచేస్తుంది.
టూరిజం తక్కువ
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ టూరిస్టులను నియంత్రణలోకి తీసుకుంటారు. ప్రతి టూరిస్ట్ కి గైడ్ అవసరం ఉంటుంది.
డిఫరెంట్ ఎకోసిస్టమ్
ఒకే ద్వీప సముదాయంలో ఉష్ణమండల, ఎడారి, పర్వత ప్రాంతాల వాతావరణాలు కనిపిస్తాయి. ఇది జీవ వైవిధ్యానికి ఎంతగానో సహకరిస్తుంది.