కొండలు, నదులు వంటివి పవిత్ర ప్రదేశాలు. అక్కడ దేవాలయాలు నిర్మించడం వలన అక్కడికి వచ్చే భక్తులు శారీరకంగా, మానసికంగా పవిత్రంగా మారతారు.
హిందూమతం ప్రకృతిని దేవతా రూపంగా భావిస్తుంది. ప్రకృతికి సమీపంగా దేవాలయాల నిర్మాణం అంటే ఆ పరమాత్మకి చేరువవ్వటం అని అర్ధం.
కొండలపై శాంతియుత వాతావరణం ఉంటుంది. అక్కడ ధ్యానం చేయడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది. అలాగే నదుల దగ్గర కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది. భగవంతునిపై ఏకాగ్రత పెంచుతుంది.
కొండపైకి ఎక్కడం శారీరకంగా చాలా కష్టంతో కూడుకొన్నది. ఇది భక్తుడు తన శ్రమను దేవుడికి అర్పించటాన్ని చూపిస్తుంది.
నదుల వద్ద దేవాలయాలు నిర్మించడం వల్ల పుణ్యనదిలో స్నానం చేసి ఎంతో పవిత్రంగా దేవుడిని దర్శించుకోవచ్చు.
ప్రకృతి ఒడిలో హోమాలు, పూజలు చేయడం వల్ల శక్తివంతమైన ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది.
కొండలపై ఉన్న ప్రదేశాలు పాజిటివ్ ఎనర్జీతో నిండివుంటాయి. దేవాలయాలు అక్కడ నిర్మించడం వల్ల భక్తులు ఆ శక్తిని గ్రహించవచ్చు.
ఎత్తైన ప్రదేశాల్లో దేవాలయాలు ఉండడం వల్ల వాటి ప్రభావం చాలా దూరం వరకూ కనిపించి భక్తులకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది.
నదులు చుట్టూ ఉండే భూమికి చాలా శక్తి ఉంటుంది. ఇక్కడ దేవాలయాలు నిర్మించటం ఎంతో శుభప్రదం.
ప్రకృతి మధ్యలో దేవాలయాల నిర్మాణం ద్వారా మనము ప్రకృతిని పరిరక్షించాలి అనే సందేశాన్ని తెలుసుకుంటాం.