పెర్సిఫోన్‌ను అండర్‌వరల్డ్ గాడ్ హాడెస్ అపహరిస్తాడు. ఆమె అక్కడే కొన్ని నెలలు గడుపుతుంది. తర్వాత భూమిపై శీతాకాలం వస్తుంది. అలా పెర్సిఫోన్ రాకతో శీతాకాలం మొదలైంది.
ప్రోమీథియస్ – అగ్ని చోరీ
ప్రోమీథియస్ మానవాళి కోసం దేవతల నుండి అగ్నిని దొంగలించి ఇస్తాడు. దీంతో జ్యూస్ అతన్ని శిక్షిస్తాడు. ప్రోమీథియస్ త్యాగం మానవాళికి గొప్ప వరం.
పాండోరా బాక్స్
దేవతలు పాండోరాకు ఒక బాక్స్ ఇస్తారు. ఆమె దాన్ని తెరిచినపుడు ప్రపంచంలో ఉన్న దురదృష్టం మొత్తం బయట పడుతుంది. చివరికి ఆశ మాత్రమే మిగులుతుంది.
హెర్క్యులిస్ 12 కష్టాలు
హెర్క్యులిస్ తన పాపాలను తుడిచివేయటానికి 12 అసాధ్యమైన పనులు పూర్తి చేస్తాడు. ఇంతకీ సొసైటీలో అతను హీరోనా? లేక శాపగ్రస్తుడా?
డేడాలస్ & ఐకారస్ కథ
డేడాలస్ తన కుమారుడు ఐకారస్‌తో సహా రెక్కలతో ఎగురుతాడు. ఐకారస్ ఎక్కువ ఎత్తుకు ఎగిరి, సూర్యునికి దగ్గరగా వెళతాడు. రెక్కలు కరిగి కింద పడిపోతాడు. ఈ స్టోరీ గర్వాన్ని తెలియచేస్తుంది.
ఓర్ఫియస్ & యూరిడిసీ ప్రేమకథ
ఓర్ఫియస్ తన భార్యను తిరిగి పొందేందుకు అండర్‌వర్ల్డ్‌కు వెళ్తాడు. కానీ, వెళ్తుండగా, వెనక్కి తిరిగి చూసి ఆమెను కోల్పోతాడు.
ఎథెనా జననం
ఎథెనా, జ్ఞాన దేవత. ఈమె జ్యూస్ యొక్క తల నుంచి జన్మిస్తుంది. యుద్ధం, న్యాయం, నైపుణ్యానికి చిహ్నం. గ్రీకు నగరం ఎథెన్స్‌కి ఈమె రక్షకురాలు.
నార్సిసస్ - స్వీయ ప్రేమ కథ
నార్సిసస్ తన ప్రతిబింబాన్ని చూసి ప్రేమలో పడతాడు. చివరికి పుష్పంగా మారతాడు. ఇలా ఇతని ప్రతిబింబమే అతనికి శాపమైంది.
సిసిఫస్ శాపం
సిసిఫస్ మోసం చేసినందుకు దేవతలు అతనికి కొండ పైకి ఒక పెద్ద బండ రాయిని తోసుకొంటూ వెళ్ళేలా శిక్ష విధిస్తారు. ఇలా ఎప్పటికీ రాయిని ఎక్కిస్తూ, పడిపోకుండా చూడటం అతనికి ఆగని కర్మగా ఇస్తారు.
ట్రోజన్ వార్ & హెలెన్
.
హెలెన్‌ను పారిస్ అపహరిస్తాడు. దానివల్ల ట్రోయ్ యుద్ధం ప్రారంభమవుతుంది. ఇది గ్రీకు గొప్ప కథలలో ఒకటి. అలాగే శక్తి, ప్రేమ, వ్యూహాల ప్రాధాన్యతను తెలుపుతుంది.