ఇది రాజస్థాన్ యొక్క రాజధాని. అంబర్ కోట, హవామహల్, సిటీ ప్యాలెస్ వంటి పురాతన కట్టడాలు, రంగు రంగుల వీధులు, ఇంకా రాజసం, సాంప్రదాయం కలగలిపిన సుందర నగరమిది.
సిటీ ప్యాలెస్, జగ్ మందిర్, పిచోలా సరస్సు వంటి నిర్మాణాలే కాకుండా ప్యాలెస్ హోటల్స్ తో ప్రసిద్ధి చెందిన నగరమిది.
మెహరాన్గఢ్ కోట, ఉమైద్ భవన్ ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలతో ఎంతో ఆకట్టుకునే నగరం. ఇక్కడి ఇళ్లు బ్లూ కలర్ లో ఉండటంతో దీన్ని బ్లూ సిటీ అంటారు.
ఎడారి, జైసల్మేర్ కోట, సమ్ డ్యూన్స్ వంటి అద్భుత ప్రదేశాలతో కూడుకొని, ఉల్లాసమైన క్యామెల్ రైడ్స్ తో ఎంతో ఆకర్షణీయమైన నగరం.
ఇక్కడి బ్రహ్మ దేవాలయం దేశంలో ఉన్న ఏకైక బ్రహ్మ దేవాలయం. పుష్కర్ సరస్సు, క్యామెల్ ఫెస్టివల్ తో ప్రసిద్ధి చెందింది.
చున్నీగడ్ ఫోర్ట్, జూనాగడ్ కోట, కార్ని మాతా ఆలయం వంటిసి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఇంకా సందడిగా ఉండే మార్కెట్లకు ప్రసిద్ధి.
చిత్రశాలలు, కోటలు, రాజపుత్ కళాత్మకతతో శోభిల్లే ప్రదేశం ఇది. బుండీ ప్యాలెస్, తారాగఢ్ కోట ఇక్కడి ప్రముఖ ఆకర్షణలు.
సారిస్కా టైగర్ రిజర్వ్, బల్క్ ఫోర్ట్, అల్వార్ ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాల సమ్మేళనం. ఈ ప్రాంతం ప్రేమికులకు ప్రధాన ఆకర్షణ.
ఇది భారతదేశంలోనే అతిపెద్ద కోట. రాణి పద్మిని కథతో ముడిపడి ఉన్న ప్రదేశం. ఇక్కడి విజయ స్థంభం, కీర్తి స్థంభం వంటి నిర్మాణాలు చారిత్రక వీరతకు ప్రతీక.
రాజస్థాన్లో ఉన్న ఏకైక హిల్ స్టేషన్. దిల్వారా టెంపుల్స్, నక్కి లేక్ వంటి ప్రకృతి అందాలకి ప్రసిద్ది.