ముస్తాంగ్ వ్యాలీ, నేపాల్

నేపాల్‌లోని ముస్తాంగ్ వ్యాలీ టిబెటన్ సంస్కృతి, కొండలు, శిలలు మరియు పురాతన గుహాలకిప్రసిద్ధి చెందింది. టూరిస్టుల కోసం ఇది మిస్టిక్‌ ల్యాండ్‌లా ఉంటుంది.

హున్జా వ్యాలీ, పాకిస్తాన్  

పాకిస్తాన్‌లోని హున్జా వ్యాలీ అందమైన మంచుతో కప్పబడిన ప్రదేశం. కొండలు, నదులు, పచ్చని పొలాలతో ఈ ప్రాంతమంతా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫోటోప్రేమికులకు ఇదొక స్వర్గధామం.

పునాఖ జోంగ్, భూటాన్

భూటాన్‌లోని పునాఖ జోంగ్ శాంతి, సాంప్రదాయాలు కలగలిపిన అందమైన బౌద్ధ స్థలం. ఇది పర్వతాల మధ్య వున్న ఓ దివ్యమైన ప్రదేశం.

బాగన్ నగరం, మయన్మార్  

మయన్మార్‌లోని బాగన్ నగరం అంతటా పురాతన పగోడాలతో నిండి ఉంది. ఇది తూర్పు ఆసియాలోని పురాతన చారిత్రక నగరాలలో ఒకటి. ఇక్కడి సూర్యోదయం సమయం చాలా ప్రత్యేకం.

కొక్బజార్ సముద్రతీరం, బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లోని కొక్బజార్ ప్రపంచంలోనే అతిపెద్దదైన సముద్రతీరం. ఇక్కడి ప్రకృతి అందాలు, సూర్యాస్తమయ దృశ్యం వీక్షకుల మనసుని దోచేస్తుంది.

నువారా ఎలియా, శ్రీలంక  

శ్రీలంకలోని నువారా ఎలియా టీ తోటలు, కొండల వాతావరణంతో నిండి ఉంటుంది, ఇది లిటిల్ ఇంగ్లాండ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శీతల వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది.

తక్త్-ఇ-బహీ, పాకిస్తాన్

పాకిస్తాన్‌లోని తక్త్-ఇ-బహీ బౌద్ధ మతానికి చెందిన పురాతన శిల్పకళా సంపద. యునెస్కో వారసత్వ స్థలంగా ఇది గుర్తింపు పొందింది.

ఫారో డిజోన్, భూటాన్  

ఫారో డిజోన్ భూటాన్‌లోని అత్యంత అందమైన బౌద్ధ మఠాలలో ఒకటి. ఇది పర్వతాలపై నిర్మించబడి ఉండటం ఓ గొప్ప విశేషం.

చిత్వన్ నేషనల్ పార్క్, నేపాల్

నేపాల్‌లోని చిత్వన్ పార్క్‌ సఫారీకి ఉత్తమ ప్రదేశం. ఇక్కడ రైనో, టైగర్, ఏనుగులు సహా అనేక రకాల వన్యప్రాణులు ఉంటాయి.  

సిగిరియా రాక్, శ్రీలంక  

నేపాల్‌లోని చిత్వన్ పార్క్‌ సఫారీకి ఉత్తమ ప్రదేశం. ఇక్కడ రైనో, టైగర్, ఏనుగులు సహా అనేక రకాల వన్యప్రాణులు ఉంటాయి.