లాబ్రడార్ రిట్రీవర్

లాబ్రడార్లకి నీటిలో ఆడుకోవడం అంటే భలే ఇష్టం. పవర్ ఫుల్ బాడీ కలిగి ఉంది నీటిని ఆస్వాదించే స్వభావం వల్ల ఇవి ఈతలో చాంపియన్లు.

గోల్డెన్ రిట్రీవర్  

ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉండే ఈ కుక్కలు నీటిలో తేలికగా ఈదగలుగుతాయి. కుటుంబ సభ్యులతో నీటిలో గడిపే సమయాన్ని చాల ఇష్టపడతాయి 

న్యూఫౌండ్లాండ్

భారీ ఆకారాన్ని కలిగి ఉన్నప్పటికీ, న్యూఫౌండ్లాండ్ కుక్కలు అద్భుతంగా ఈదగలుగుతాయి. ఇవి రెస్క్యూ డాగ్స్‌గా కూడా ఉపయోగపడతాయి. నీటిలో సహాయంగా కూడా పని చేస్తాయి.

స్టాండర్డ్ పూడుల్  

స్టైలిష్‌గా కనిపించినా, పూడుల్స్ చక్కగా ఈదగలవు. మొదట వీటిని వేట కుక్కలుగా పెంచారు. అయినప్పటికీ స్విమ్మింగ్ అంటే వీటికి చాలా ఇష్టం.

ఐరిష్ వాటర్ స్పానియెల్

పొడవాటి తోక, కర్లీ హెయిర్ తో ఈ జాతి ఈతకు పుట్టింది. వేటకోసం నీటిలో తడిచే సమయంలో శక్తివంతంగా పనిచేస్తుంది.

చెసపీక్ బే రిట్రీవర్  

ఈ డాగ్ బ్రీడ్ వింటర్ సీజన్ కూడా నీటిలో ఈదగలవు. క్రమశిక్షణతో కూడిన శరీర నిర్మాణం, ఆత్మవిశ్వాసం ఈతలో వీటిని ముందుండేలా చేస్తుంది.

పోర్చుగీస్ వాటర్ డాగ్

పోర్చుగల్ సముద్ర తీర ప్రాంతాల్లో పనిచేసే ఈ డాగ్స్  మంచి స్విమ్మర్స్. స్పీడ్ గా వాటర్ లో స్విమ్ చేస్తూ ఫిషర్ మెన్ కి ఎక్కువగా హెల్ప్ చేస్తుంటాయి.  

అమెరికన్ వాటర్ స్పానియెల్ 

ఇవి చిన్నవైనా, ఈతలో బలంగా పనిచేస్తాయి. సరస్సులు, నదుల్లో ఈత కొట్టడానికి వీటి శరీర నిర్మాణం బాగా ఉపయోగపడుతుంది.

లియన్బెర్గర్  

స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్, నీటిపట్ల ఆకర్షణతో లియన్బెర్గర్ కుక్కలు మంచి ఈతగాళ్లు. ఒకరకంగా ఇవి నీటిలో పని చేయడానికే పుట్టినవని చెప్పొచ్చు.

నోవా స్కోటియా డక్ టోలింగ్ రిట్రీవర్

చిన్న పరిమాణంలో ఉన్నా, ఇవి ఎంతో చురుకుగా ఉండే కుక్కలు. నీటిలో శత్రువులను మోసగించడంలో నిపుణులు. ఇంకా ఇవి మంచి ఈతగాళ్లే.