హిమాలయాలు – ఆసియా
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రేణి ఇది. ఎవరెస్ట్‌తో సహా అనేక శిఖరాలు ఇందులోనే ఉన్నాయి. భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి.
ఆండీస్ – దక్షిణ అమెరికా
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి. ఆర్జెంటీనా నుంచి కొలంబియా వరకూ ఇది విస్తరించింది.
రాకీ మౌంటెన్స్ – ఉత్తర అమెరికా
కెనడా నుంచి మెక్సికో వరకూ విస్తరించిన గొప్ప శ్రేణి ఇది. ప్రకృతి ప్రేమికులకు, స్కీయింగ్ ప్రియులకు అనువైన ప్రదేశం
ఆల్ప్స్ – యూరప్
స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్‌లోని ఈ శ్రేణి హిమానీనదాలతో అలరిస్తుంది. టూరిజం, స్కీయింగ్‌కు ఎంతో ప్రసిద్ధి గాంచింది.
ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ – ఆస్ట్రేలియా
ఇది ఆస్ట్రేలియాలోని ప్రధాన పర్వత శ్రేణి. మౌంట్ కాసియస్కో ఇక్కడి అత్యున్నత శిఖరం. చల్లని వాతావరణం, మంచు అందాలు ఆకర్షణగా ఉంటాయి.
అట్లాస్ పర్వతాలు – ఉత్తరాఫ్రికా
ఈ పర్వత శ్రేణి మొరాకో, అల్జీరియా, ట్యూనీషియా దేశాల్లో విస్తరించింది. ఇక్కడ బర్బర్ తెగలు నివసిస్తారు. సహారాకు అడ్డుకట్టగా నిలుస్తుంది.
కార్పతియన్ పర్వతాలు – యూరప్
ఈ పర్వతాలు ఈస్ట్రన్ యూరప్‌లో రోమేనియా, పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో విస్తరించి ఉన్నాయి. అడవులు, అడవి జంతువులతో ఇది ఓ గొప్ప పర్యాటక ప్రదేశం.
డినరిక్ ఆల్ప్స్ – బాల్కన్ ప్రాంతం
ఇటలీ నుంచి అల్బేనియా వరకూ విస్తరించిన శ్రేణి. శిలా నిర్మాణాలు, లోయలు, నదులతో ప్రకృతి అందాన్ని కలిగిస్తుంది.
టియాన్ షాన్ – మధ్య ఆసియా
చైనా, కిర్గిజ్స్తాన్, కజకిస్థాన్ దేశాల్లో విస్తరించింది. ఇక్కడ హిమానీనదాలు, గ్లేసియర్లు ఎక్కువగా కనిపిస్తాయి.
ఉరాల్ పర్వతాలు – రష్యా
యూరప్, ఆసియాల మధ్య భౌగోళిక సరిహద్దుగా నిలిచే శ్రేణి ఇది. ఖనిజ సంపదకు ప్రసిద్ధి. పురాతనమైన శిలలు ఇక్కడ కనిపిస్తాయి.