టోక్యో టవర్ నుండి సిటీ ఏరియల్ వ్యూ చూడొచ్చు. నైట్ టైం లైటింగ్ లో మెరిసే ఈ టవర్, జపాన్ టూర్ కి ప్రత్యేక ఆకర్షణ.
కియోటో గోల్డెన్ ప్యాలెస్
కింకాకు-జి గా ప్రసిద్ధి చెందిన ఈ గోల్డెన్ టెంపుల్, శాంతి మరియు కళాత్మకతకు ప్రతీక. వాటర్ లో కనిపించే ఈ ఆలయ ప్రతిబింబం చాలా మిస్టీరియస్ గా ఉంటుంది
మౌంట్ ఫుజి
ఇది జపాన్‌కు ప్రతీకగా నిలిచే ఫుజియామా పర్వతం. దానిపై గోపురంలా కనిపించే మంచుని చూస్తే ప్రకృతి మహిమను ఆస్వాదించకుండా ఉండలేరు.
నారా డియర్ పార్క్
ఈ పార్క్‌లో స్వేచ్ఛగా తిరిగే జింకలను చూస్తూ సేదతీరవచ్చు. ఈ పార్క్ లోనే పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల పక్కనే నడుచే జింకలు ప్రయాణికులకు కొత్త అనుభూతి.
హిరోషిమా శాంతి స్మారకం
ఇది ప్రమాదకరమైన అణుబాంబ ధ్వంసాన్ని గుర్తు చేసే స్మారకం, శాంతి అవసరాన్ని గుర్తుచేస్తుంది. హృదయాన్ని తాకే ప్రదేశం.
అరకషీయ బాంబూ ఫారెస్ట్, కియోటో
అతిశయమైన బాంబూ అడవుల మధ్య నడక అనుభవం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ప్రకృతిని నిశ్శబ్దంగా ఆస్వాదించేందుకు ఇది ఉత్తమ స్థలం.
ఒసాకా క్యాసిల్
సాంస్కృతిక శిల్పకళకు నిదర్శనమైన ఒసాకా కోట, చరిత్ర ప్రేమికులకీ, ఫోటోగ్రాఫర్‌లకీ ఓ మరిచిపోలేని అనుభవం .
హక్కొడేట్ నైట్ వ్యూ
హక్కొడేట్ నగరాన్ని పర్వతం మీద నుంచి చూసే నైట్ వ్యూ , జపాన్‌లో అత్యంత అందమైన రాత్రి దృశ్యాలలో ఒకటి.
షిరకావా-గో విలేజ్
మంచుతో కప్పబడి ఉండే గస్సో-జుకురి శైలిలోని ఇళ్లు, జపాన్ గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి. ఇవి UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి.
డిస్నీలాండ్ టోక్యో
పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే టోక్యో డిస్నీలాండ్, మనల్ని కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే వినోదభరిత ప్రదేశం.