బయోలుమినిసెంట్ జీవులు

సముద్రపు లోతుల్లో అంతా అందకారంగా ఉంటుంది. అందుకే ఇక్కడ నివసించే జీవులు తమ బాడీలో రిలీజయ్యే బయోలుమినిసెన్స్ అనే కెమికల్ ద్వారా వెలుతురు విరజిమ్ముతూ అద్భుతంగా కనిపిస్తాయి.

డీప్ సీ మాగ్నటిక్ ఫిష్

ఈ చేపలు ఆకారంలో భిన్నంగా ఉండి, ఇతర ప్రాణులను ఆకర్షించేందుకు వెలుతురును ఉపయోగిస్తాయి. వీటి తల భాగంలో ఉండే కాంతి ఓ మాయాజాలం లాంటిది.

సముద్ర పాములు 

లోతుల్లో నివాసం చేసే కొన్ని సముద్ర పాములు ఎర్ర రంగుతో మెరిసిపోతూ కనిపిస్తాయి. ఇవి భయానకంగా ఉండేలా ఉన్నా అందంగా కూడా కనిపిస్తాయి.

సముద్ర ఎనిమోన్లు 

కొన్ని జీవులు గులాబీ పూలను తలపించే ఆకారంతో ఉండి, జెల్లీలా తేలియాడుతుంటాయి. అవి చూడ్డానికి నీలి కాంతిలో స్వర్గంగా అనిపిస్తాయి.

సముద్ర శిలల మాయాజాలం 

డీప్ సీలోని శిలలు వింత ఆకారాలతో ఉండి, వాటిపై అరుదైన జీవులు నివాసం ఉంటాయి. ఇవి ప్రకృతి శిల్పాల్లా కనిపిస్తాయి.

రంగులు మార్చే ఆక్టోపస్ 

లోతుల్లో ఉండే ఆక్టోపస్ అనేక రంగులతో మెరిసిపోతూ వర్ణరూపాలు మారుస్తూ కనిపిస్తుంది. ఇవి సినిమాల్లో వాడే గ్రాఫిక్స్‌ను తలపిస్తాయి.

క్రిస్టల్ జెల్లీ ఫిష్ 

ఈ జెల్లీ ఫిష్‌లు పూర్తిగా పారదర్శకంగా ఉండి, వాటి శరీరంలో కాంతి తిరుగుతూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తాయి.

బ్లూ ఫిష్ 

కొన్ని చేపలు బ్లూ అండ్ ఎల్లో కలర్ కంబోలో మెరిసిపోతూ, నదుల వలె ప్రవహించే ఆకారాన్ని చూపిస్తూ అద్భుతంగా కనిపిస్తాయి.

బారెల్ ఐ ఫిష్

ఇది తలలోనే చూపు ఉండే అరుదైన చేప. దీని కళ్లను బయట నుంచి చూడవచ్చు. ఇది భవిష్యత్తు జీవిలా కనిపిస్తుంది.

యాంగ్లర్ ఫిష్  

ఈ ఫిష్ లోతైన సముద్రంలో చీకటిలో తమ ఎరని పట్టుకోవటానికి వాటి తలపై ఉండే యాంగ్లర్ లాంటి రాడ్ మెరుస్తూ ఉంటుంది.