ప్రపంచంలోనే అతిపెద్ద జీవి
బ్లూ వేల్స్ భూమిపై ఇప్పటి వరకూ ఉన్న అతిపెద్ద జీవి. వీటి పొడవు 100 అడుగులు, బరువు 180 టన్నులు వరకు ఉండవచ్చు.
గుండె సైజ్
బ్లూ వేల్ గుండె ఒక చిన్న కార్ సైజ్‌కి సమానం. ఒక్కసారి హార్ట్ బీటింగ్ కి, 1500 లీటర్ల రక్తం పంపుతుంది.
బేబీ వేల్స్ పెరుగుదల
పుట్టిన బేబీ వేల్ ఒక్కరోజులో సుమారు 90 కిలోలు పెరుగుతుంది. రోజుకు 380 లీటర్ల తల్లి పాలు త్రాగుతుం
ఇవి పాటలు పాడతాయి
బ్లూ వేల్స్ పాటలు కూడా పాడతాయి. వాటి పాటలు, మరియు శబ్ద తరంగాలు 1000 కి.మీ దూరం వరకు వినిపిస్తాయి.
టన్నుల్లో భోజనం
ఒక బ్లూ వేల్ రోజుకు సుమారు 4 టన్నుల క్రీల్ (చిన్న సముద్ర జీవులు) తినగలదు. ఇది వేలాది ఊబకాయుల ఆహారానికి సమానం.
శ్వాస కోసం
బ్లూ వేల్ 90 నిమిషాలు నీటిలో ఉండగలదు. అయితే సాధారణంగా ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి శ్వాస తీసుకోవటం కోసం ఇది నీటి మీదకి వస్తుంది.
ఊపిరితిత్తులు సామర్థ్యం
బ్లూ వేల్ ఊపిరితిత్తుల సామర్థ్యం 5000 లీటర్లకు పైగా ఉంటుంది. ఒక్క సారి ఊపిరి పీల్చినప్పుడు ఉపరితలంపై నీటిని ఎగరేస్తుంది.
అంతరించిపోతున్న జాతి
పూర్వంలో లక్షల్లో ఉన్న బ్లూ వేల్స్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10,000 మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ఇవి అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతున్నాయి.
లైఫ్ స్పాన్
బ్లూ వేల్ జీవితం సాధారణంగా 80 నుంచి 90 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనవి 100 ఏళ్లు కూడా బతికినట్టు సమాచారం.
నీలి రంగు భ్రమే!
వాస్తవానికి బ్లూ వేల్ రంగు బ్లూ కాదు. నీటిలో వెలుతురు దానిపై రిఫ్లెక్ట్ అవ్వటం వల్లనే అవి నీలంగా కనిపిస్తాయి.