ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జెల్లీఫిష్. దీన్ని తాకితే కొన్ని నిమిషాల్లోనే గుండె ఆగిపోతుంది.
ఆకారం
ఇవి సాదారణ జెల్లీ ఫిష్ ల వలే కాకుండా విభిన్నంగా ఉంటాయి. క్యూబ్ ఆకారంలో ఉంటాయి లేదంటే గంట ఆకారంలో ఉంటాయి.
శరీరం
ఈ జెల్లీఫిష్ శరీరం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. గమనించలేని స్థితిలో సముద్రంలో తిరుగుతుంది. ఇది దాని ప్రమాదకతను పెంచుతుంది.
టెంటకిల్స్
ఒక్క బాక్స్ జెల్లీఫిష్‌కు 60 వరకు టెంటకిల్స్ ఉంటాయి. ఒక్కో టెంటకిల్ 3 మీటర్ల పొడవు ఉంటుంది. దాని చివర్లో విషం ఉంటుంది. ఇవి కుట్టినప్పుడు ఈ విషాన్ని ఇంజెక్ట్ చేస్తాయి.
విష ప్రభావం
బాక్స్ జెల్లీఫిష్ ని తాకిన వెంటనే మన శరీరంపై తీవ్రమైన మంట, నొప్పి కలుగుతుంది. తాకిన 2-5 నిమిషాల్లో గుండె ఆగిపోవచ్చు. లేకుంటే ప్రాణాలు కూడా పోవచ్చు.
దశలవారీగా
ఇవి కుట్టటం వల్ల మొదట చర్మంపై మంట, తర్వాత కండరాల తిమ్మిరి, తర్వాత శ్వాస సంబంధిత సమస్యలు, చివరికి గుండె ఆగిపోవడం జరుగుతుంది.
నివాసం
ఇవి ఎక్కువగా వెచ్చని సముద్ర జలాల్లో నివసిస్తాయి, ముఖ్యంగా ఉత్తర ఆస్ట్రేలియా మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
స్విమ్మర్లకు ముప్పు
ఈ జెల్లీఫిష్ ప్రధానంగా సముద్ర తీరాల్లో తిరుగుతుంది. స్విమ్మింగ్‌కు వెళ్లే వారు దీన్ని గుర్తించలేకపోతే ప్రాణహాని తప్పదు.
స్పీడ్‌గా ఈదగలదు
ఇది సాధారణ జెల్లీఫిష్లకంటే వేగంగా ఈదగలదు. ఇది మిగిలిన జెల్లీఫిష్లతో పోలిస్తే ఎక్కువ చురుకైనది.
రియాక్షన్
ఇవి కుట్టగానే అత్యవసర వైద్య సహాయం, యాంటీ వెనోమ్ డ్రగ్స్ తప్పనిసరి. కొన్నిసార్లు వెనిగర్ వేసినా ఫస్ట్ ఎయిడ్ లభిస్తుంది.