ఆక్సోలోట్ల్

ఈ నీటి జీవి శత్రువు దాడిచేస్తే, దానిని తప్పించుకుని పరార్ అవుతుంది. ఒకవేళ ఆర్గాన్స్ కోల్పోతే…కోల్పోయిన తన శరీర భాగాలను తిరిగి పెంచుకోగలదు.

అక్మేఫెరా మొక్క 

ఈ సముద్ర జీవి ఇతర క్రూర జంతువుల వేషాలు వేస్తుంది. దోమలు లేదా విషసర్పాలలా మారి శత్రువులను సైతం భయపెడుతుంది.

హార్లిక్విన్ ఫిష్ 

ఈ చేప సముద్రపు వృక్షాల వాసనను పొందుతుంది. దీని వాసనతో ప్రిడేటర్లు దాన్ని అస్సలు గుర్తించలేవు.

ఒపోసమ్   

ఇది చనిపోయినట్లుగా నటిస్తుంది. శత్రువు దాని దేహాన్ని స్పృశించినా జీవించట్లేదని అనుకుని వదిలేస్తుంది.

బాంబర్డియర్ బీటిల్   

ఇది వేడిగా ఉప్పొంగే రసాయనాన్ని శత్రువులపై పేల్చుతుంది. ఆ ఉష్ణతతో శత్రువు పరుగు పెడుతుంది.

మాంటిస్ ష్రిమ్స్

ఇది అత్యంత వేగంగా తన పంజాతో దెబ్బకొడుతుంది. శత్రువు అంచనాలు మించే వేగంతో దాడి చేస్తుంది.

కటిలేని పాములు   

కొన్ని కటిలేని పాములు విషపూరిత పాముల వేషం వేస్తాయి.  హిస్స్ శబ్దాన్ని చేస్తాయి. చనిపోయినట్టుగా నటిస్తాయి. ఇలా రకరకాలుగా శత్రువులను భయపెడతాయి.

క్యాటర్ పిల్లర్ 

కొన్ని పిల్ల పురుగులు పెద్ద కళ్ళతో ఉన్నట్లుగా కనిపించే ఆకారంలో ఉంటాయి. ఇది పక్షులను భయపెడుతుంది.

ప్లవర్ మాంటిస్  

ఈ పురుగు చూడానికి పుష్పంలా కనిపిస్తుంది. శత్రువులు దాన్ని ఓ పువ్వుగా భావించి దానిపి దృష్టి పెట్టరు.

కటిల్‌ఫిష్

ఇవినీటిలో మెల్లిగా కదులుతాయి వీటి శరీరం రంగులు మార్చుకుంటుంది. దానివల్ల శత్రువులు దాన్ని గమనించలేరు.