జపాన్

జపాన్ ప్రజలు మర్యాదగా, మృదువుగా ఉంటారు. టూరిస్టులకి  వెల్కమ్ చెప్పడంలో ముందుంటారు. అక్కడి కల్చర్, హోస్ట్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి

థాయిలాండ్ 

థాయిలాండ్‌ను "స్మైల్స్ దేశం" అని పిలుస్తారు. ఎందుకంటే, ఇక్కడి ప్రజలు ఎంతో ఆతిథ్యభావం కలిగి ఉంటారు. పర్యాటకులను ఎంతో స్నేహపూర్వకంగా ఆదరిస్తారు.

న్యూజిలాండ్ 

న్యూజిలాండ్ ప్రజలు అతి మృదువుగా, సహాయంగా ఉంటారు. ప్రకృతి అందాలు చూసేందుకు వచ్చే టూరిస్టులను వారు చాలా గౌరవిస్తారు 

ఐస్ లాండ్ 

ఐస్ లాండ్ లో ప్రజలు పర్యాటకులకి ఎంతో చక్కటి ఆతిథ్యం ఇస్తారు. కొత్తవారితో మాట్లాడటంలో ఆసక్తి చూపుతారు. టూరిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. 

కెనడా 

కెనడియన్లు శాంతియుతంగా, మర్యాదగా ఉంటారు. పర్యాటకులకు రూట్ డైరెక్షన్ ఇవ్వటం, సెల్ఫీలు  దిగటం వంటి విషయాల్లో తక్షణ సహాయం అందిస్తారు. 

ఆస్ట్రేలియా 

ఆస్ట్రేలియన్లు మంచి మనసుతో ఉంటారు. ప్రకృతి సౌందర్యంతో పాటు వారి హాస్యం, హృదయపూర్వకత టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తుంది.

పోర్చుగల్ 

పోర్చుగీస్ ప్రజలు అందరినీ కుటుంబ సభ్యులా చూస్తారు. పర్యాటకులకు స్థానిక వంటకాలు, సాంప్రదాయాలను పరిచయం చేయడంలో ఎంతో గర్వపడతారు.

మెక్సికో

మెక్సికన్లు ఉత్సాహభరితంగా, మానవత్వంతో వ్యవహరిస్తారు. టూరిస్టులతో చక్కటి సంభాషణలు, ఆతిథ్యం అందించడం అంటే ఎంతగానో ఇష్టపడతారు.

ఇటలీ 

ఇటాలియన్ ప్రజలు చురుకైన సంభాషణలతో టూరిస్టులను ఆకట్టుకుంటారు. వారు పర్యాటకులకి ఫుడ్, ఆర్ట్, కల్చర్ లో షేరింగ్ ఇవ్వాలని కోరుకుంటారు.

ఇండోనేషియా 

ఇండోనేషియన్లు వినయంగా, శాంతియుతంగా ఉంటారు. ముఖ్యంగా బాలీ ద్వీపంలో టూరిస్టులపై ప్రేమ, గౌరవం మనకి స్పష్టంగా కనిపిస్తుంది.