మచుపిచ్చు - పెరూ

ఆండీస్ పర్వతాల్లో ఉన్న 15వ శతాబ్దపు ఇన్‌కా నగరమిది. మేఘాల మధ్య తేలుతూ కనిపించే ఈ ప్రదేశం చూసేవారికి ఒక నిజమైన మాయాజాలంలా ఉంటుంది.

గ్రాండ్ కేనియన్ - అమెరికా

అరిజోనాలో ఉన్న ఈ విస్తృత గండికోట కట్టుదిట్టమైన వాలు, చుట్టూ కొండ చరియల మద్య లోతైన, ఇరుకైన లోయలో ప్రవహించే నది, ఎర్రటి మట్టితో ప్రకృతి సృష్టించిన అద్భుత కళాఖండం.

హాల్‌స్టాట్ - ఆస్ట్రియా 

ఆల్ప్స్ పర్వతాల కింద ఉన్న ఈ ఊరు హాల్‌స్టాట్ సరస్సు ఒడ్డున ఉంది. ప్రశాంతంగా, సరస్సు అద్దంలా మెరుస్తూ, స్వర్గాన్ని తలపిస్తుంది.

నోర్వే ఫ్యోర్డ్స్ 

గొప్ప మంచుతో కప్పబడి, నీటి లోయలు మరియు పర్వతాల మధ్య ప్రవహించే వీటి అందం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

మిల్కీ వే గాలాక్సీ - అటాకామా ఎడారి

చిలీలోని అటాకామా ఎడారిలో రాత్రి కలలు మాదిరి తారల వాన, మిల్కీ వే స్పష్టంగా కనిపిస్తుంది.

బెనాగిల్ సముద్ర గుహలు - పోర్చుగల్

సముద్రపు అలలు కొట్టే రంధ్రాల మధ్య పొద్దుపొయ్యే కాంతి అందంగా పడే ప్రదేశం. ఇలాంటి ప్రాంతం చాలా అరుదుగా ఉంటుంది.

పాముక్కలే - టర్కీ

థర్మల్ స్ప్రింగ్ వాటర్ ప్రవహించడం ద్వారా మిగిలిపోయిన కార్బోనేట్ ఖనిజాలతో కనిపించే తెల్లటి ఉష్ణజలపు పొరలు, ఆరోగ్యానికి మాత్రమే కాదు, కళాత్మకంగా కూడా అపూర్వం.

మౌంట్ ఫుజీ - జపాన్

శీతాకాలంలో మంచుతో కప్పబడి, వసంతంలో చెర్రీ బ్లాసమ్‌ల మధ్య కనిపించే ఈ పర్వతం నిజమైన జపాన్ ప్రతీక.

విక్టోరియా ఫాల్స్ - ఆఫ్రికా 

ఇది జాంబియా-జింబాబ్వే సరిహద్దులో ఉంది. బసాల్ట్ రాతి ద్వారా అద్భుతమైన లోయలను చీల్చుతూ ఉగ్రమైన ప్రవాహంగా ప్రవహించే ఈ జలపాతం ఓ అద్భుతం. 

అరోరా బొరియాలిస్ - ఐస్లాండ్

సౌరగాలులు వాతావరణంలోని అణువులతో తాకినప్పుడు, అవి ప్రకాశవంతమైన కాంతిని విడుదల చేస్తాయి. అవి రాత్రి ఆకాశంలో రంగుల కాంతులుగా మారి ప్రకృతికి జీవం ఉన్నట్టు భావన కలిగిస్తాయి.