గ్రీన్లాండ్ షార్క్

గ్రీన్లాండ్ షార్క్ సముద్రంలో నిశ్శబ్దంగా జీవించే చేప. ఈ చేప స్లో మెటబాలిజం కలిగి ఉండి…సుమారు 400 సంవత్సరాల వరకు జీవించగలదు.

బౌహెడ్ తిమింగలం 

ఆర్కెటిక్ సముద్రాల్లో కనిపించే బౌహెడ్ తిమింగలం సుమారు 200 సంవత్సరాల వరకు జీవిస్తుంది. దీని డిఎన్‌ఏ మరణాన్ని ఆలస్యం చేస్తుంది.

రెడ్ సీ ఉర్చిన్ 

ఈ చిన్న సముద్రజీవి 200 సంవత్సరాల వరకు బతికే శక్తి కలిగి ఉంటుంది. దీని రక్షణ శక్తి ఎంతో గణనీయమైనది.

గాలాపగోస్ టార్టాయిస్ 

ఈ భారీ తాబేలు 175 సంవత్సరాల వరకు జీవించగలదు. నెమ్మదిగా జీవించడమే దీని దీర్ఘాయువు యొక్క రహస్యం 

కోయి ఫిష్  

జపాన్‌లో ప్రసిద్ధమైన కోయి ఫిష్ 200 సంవత్సరాల వరకు జీవించవచ్చు. కొన్ని ఫిష్‌ల వయస్సు అయితే రికార్డు స్థాయిలో ఉంది. 

రౌగ్ ఐ రాక్‌ఫిష్

ఈ చేప ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఇది సుమారు 205 సంవత్సరాల వరకు జీవించగలదు. 

అల్డబ్రా జెయింట్ టార్టాయిస్  

ఇది 150-200 సంవత్సరాల వరకు జీవించే మరో తాబేలు. దీనికి తక్కువ శరీర గతి, ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది. 

గ్లాస్ స్పాంజ్

ఈ సముద్ర స్పాంజ్ జీవులు 10,000 సంవత్సరాలుగా ఉన్నాయని శాస్త్రీయంగా భావిస్తున్నారు. ఇవి సముద్ర గర్భంలో శతాబ్దాలుగా నివసిస్తాయి.

ట్యూవ్ వర్మ్స్  

ఈ సముద్ర పురుగులు సముద్ర గర్భాల్లో వందల సంవత్సరాలు జీవించగలవు. వీటి జీవనశైలి అవసరమైనప్పుడు వీటికి  శక్తిని తగ్గిస్తుంది.

ఆర్క్టిక్ ఐస్ క్లామ్

ఈ చిన్న జీవి 500 సంవత్సరాలకు పైగా జీవించగలదు. మింగో అనే క్లామ్ 507 ఏళ్ల వయస్సుతో రికార్డు సృష్టించింది