ఎవరెస్ట్ శిఖరం
భూమిపై అత్యంత ఎత్తు కలిగిన స్థలం మౌంట్ ఎవరెస్ట్. ఇది సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. ట్రెక్కింగ్ లవర్స్ కి లక్ష్యం ఇది!
బుర్జ్ ఖలీఫా
దుబాయిలో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. దీని ఎత్తు 828 మీటర్లు. ఇది మానవ నిర్మాణ శక్తికి ప్రతీకగా నిలుస్తుంది.
హిమాలయాలు
హిమాలయ శ్రేణులు ఎన్నో ఎత్తైన శిఖరాలతో భూమిపై స్వర్గంగా కనిపిస్తాయి. ఇది ప్రపంచంలో అత్యధిక పర్వత శిఖరాలు కలిగిన ప్రాంతం.
అమెజాన్ అరణ్యం
అమెజాన్ అరణ్యం ప్రపంచానికి ఊపిరి పోసే అడవి. దీని విస్తీర్ణం 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఎన్నో జీవజాతులకు ఇది నిలయం.
సహారా ఎడారి
ఆఫ్రికాలోని సహారా ఎడారి 9.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల ఎడారి
పసిఫిక్ మహాసముద్రం
పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం. ఇది భూమి ఉపరితలంలో 30% పైగా విస్తరించి ఉంది.
మరియానా ట్రెంచ్
పసిఫిక్ మహాసముద్రం లోపల ఉన్న మరియానా ట్రెంచ్ లోతు సుమారు 11,000 మీటర్లు. ఇది భూమిపైనున్న అత్యంత లోతైన ప్రాంతం.
క్రిస్టల్ గుహ
మెక్సికోలోని క్రిస్టల్ గుహలో భారీ గాజు క్రిస్టల్స్ ఉంటాయి. ఇవి 12 మీటర్ల పొడవు, 55 టన్నుల బరువుతో ఉంటాయి.
ఆంటార్కిటికా
ఆంటార్కిటికా ఖండంలో -89°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇది భూమిపై అతి చల్లగా ఉండే ఖండం
భూగర్భ కేంద్రం
భూమి కేంద్రం సుమారు 6,400 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు సూర్యునికి సమానంగా –5,500°C వరకూ ఉంటాయి.