లూవ్రే మ్యూజియం, ఫ్రాన్స్

పారిస్‌లోని లూవ్రే ప్రపంచపు అతిపెద్ద కళా మ్యూజియం. మోనాలిసా వంటి క్లాసిక్ కళాకృతులకు నిలయం. గ్లాస్ పిరమిడ్ ఆకారం ఈ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ.

బ్రిటిష్ మ్యూజియం, లండన్

ప్రాచీన నాగరికతల కధలను చాటిచెప్పే బ్రిటిష్ మ్యూజియం. ఈజిప్ట్ మమ్మీస్, గ్రీకు శిల్పాలు వంటి అపురూప కళాఖండాలతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

వాటికన్ మ్యూజియమ్స్, ఇటలీ 

రోమ్‌లో ఉన్న వాటికన్ మ్యూజియమ్స్‌లో మైకెల్ ఆంజెలో వేసిన సిస్టైన్ చాపెల్ సీలింగ్ చాలా ప్రసిద్ధి. క్రైస్తవ కళా సంపదను చూడటానికి ఇది మంచి ప్రదేశం.

మెట్రోపాలిటన్ మ్యూజియం, న్యూయార్క్ 

ఈ మ్యూజియంలో 5 వేల ఏళ్ల కళను చూస్తారు. ఈజిప్టు పిరమిడ్ల నుంచి యూరోపియన్ మాస్టర్స్ ఆర్ట్స్ వరకు అనేక ప్రత్యేక కలెక్షన్స్ ఉన్నాయి.

హెర్మిటేజ్ మ్యూజియం, రష్యా  

సెయింట్ పీటర్స్బర్గ్‌లోని హెర్మిటేజ్ ప్రపంచపు పురాతన, అద్భుత కళల నిలయం. చారిత్రక భవనం ఈ మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

రిజ్‌క్‌మ్యూజియం, నెదర్లాండ్స్

ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఈ మ్యూజియం డచ్ గోల్డెన్ ఏజ్ కళాకారుల కళలతో ప్రసిద్ధి. రెంబ్రాంట్, వెర్మీర్ కళలంటే ఇష్టం ఉంటే తప్పక చూడాల్సిందే.

ఉఫిజీ గ్యాలరీ, ఇటలీ  

ఫ్లోరెన్స్‌లోని ఉఫిజీ రెనైస్సెన్స్ కళల పుట్టినిల్లు. బొట్టిచెల్లి, లియోనార్డో డ విన్చీ వంటి దిగ్గజాల కళలు ఇక్కడ చూడవచ్చు. 

నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనా, బీజింగ్

ఫ్లోరెన్స్‌లోని ఉఫిజీ రెనైస్సెన్స్ కళల పుట్టినిల్లు. బొట్టిచెల్లి, లియోనార్డో డ విన్చీ వంటి దిగ్గజాల కళలు ఇక్కడ చూడవచ్చు.