రీసెంట్ గా యూరోప్‌లో కొన్ని గ్రామాలు మొత్తం ఖాళీగా మారిపోయాయి! జనాభా లేకుండా మానవులే కనిపించని నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి!

ఇటలీ, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాల్లో కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గుతోంది… దీనికి కారణం మానవతా సంక్షోభం.

ప్రతి మహిళకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టడం లేదు! జనాభా పెరుగుదల సగటు రేటు కంటే తక్కువగా ఉంది. జనాభా నిలిచిపోవటానికి ఇదే కారణం. 

యువత పెళ్లికి ఆలస్యం చెయ్యడం, పిల్లలపై ఆసక్తి లేకపోవడం, జీవితశైలిలో మార్పులు ఇలా అనేక కారణాలు ఉన్నాయి

పిల్లల్ని కనాలంటే ఖర్చులు ఎక్కువ అవుతాయేమోనన్న   భయం. అయితే మనుషులే లేకపోతే అర్థవంతమైన భవిష్యత్తు ఉందా?

పెన్షన్ తీసుకునే వారే ఎక్కువ, పని చేసే వారు తక్కువ! దీంతో పెన్షన్ వ్యవస్థపై భారం పెరిగి, ఆర్థిక విధ్వంసానికి కారణమవుతుంది. 

వినియోగదారులు తగ్గిపోవడం వల్ల మార్కెట్ తగ్గిపోతుంది. జనాభా తగ్గిపోవడంతో పలు గ్రామాలు, పట్టణాలు ఖాళీగా మారుతున్నాయి. విద్యా సంస్థలు, వ్యాపారాలు మూత పడుతున్నాయి.

దీంతో యూరప్. పూర్తిగా వలసదారులపై ఆధారపడుతోంది కానీ ఈ విధానాన్ని స్థానికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. 

పుట్టుక తగ్గడానికి కారణం– జీవన విధానంలో వచ్చిన మార్పులు కాదు,  జీవితంపై భయం అంటున్నారు నేటి యువత! నిజమేనా?

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక పథకాలు, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్‌లు ప్రవేశపెడుతున్నాయి. ఇది సరైన పరిష్కారమా? మీరే ఆలోచించండి!