మనాలి నుండి లేహ్

హిమాలయాల గుండెలోని ఈ మార్గం, ప్రకృతిలో గొప్ప ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మంచు పర్వతాలు, నదులు, నీలాకాశం –ఈ  ప్రయాణం  ఓ స్వర్గంలా ఉంటుంది.

శ్రీనగర్ నుండి కార్గిల్  

తక్కువ రద్దీ, కానీ అపూర్వ దృశ్యాలు. శ్రీనగర్ డాల్ సరస్సు నుంచి లద్దాఖ్ కొండలు వరకు ప్రకృతి అంతా అద్భుతంగా మారుతుంది.

ఢిల్లీ నుండి స్పీతి వ్యాలీ

పురాణాలలాగా కనిపించే స్పీతి వ్యాలీకి ప్రయాణం అనేది జీవితంలో ఓ గొప్ప అనుభవం. ఎడారిలాంటి లోయలు, మతపరమైన స్థలాలు కనులపండువగా ఉంటాయి.

చండీగఢ్ నుండి కాసౌలి  

చిన్నదైన ట్రిప్, కానీ ప్రకృతితో నిండినది. చండీగఢ్ మోడర్న్ సిటీ నుంచి పర్వతాల మధ్య కాసౌలి వరకు ఆనందదాయకం.

ఢిల్లీ నుండి నైన్‌టాల్

నైనీ సరస్సు, కొండల కౌగిలిలో ఉన్న అందమైన పట్టణం. రహదారి మొత్తం హరిత నదులు, పర్వతాలతో ఆహ్లాదంగా ఉంటుంది.

ఢిల్లీ నుండి మసూరీ  

బాల్యానుభూతులను తలపించే మసూరీ ప్రయాణం. కోనలుగా వెళ్లే మార్గం. ఇక్కడి మంచు కొండలు, వనాలు ఆకట్టుకుంటాయి.

ఢిల్లీ నుండి రిషికేష్

ఆధ్యాత్మికతకు తోడుగా అడ్వెంచర్ స్పోర్ట్స్. గంగా నది పక్కనే ప్రయాణం, ప్రశాంతతకు మారుపేరు. 

జైపూర్ నుండి ఊదేపూర్

రాజస్థాన్ రాజరిక సంపదను చూపించే ఈ ట్రిప్, పురాతన కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులతో నిండినది.

సిమ్లా నుండి చైల్ 

బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ప్రయాణం. స్నోఫాల్, దేవదారు వనాలు, గాలిలో వాలిపోవాలనిపించే శాంతత దీని సొంతం.

ఢిల్లీ నుండి బిర్ బిల్లింగ్  

పారాగ్లైడింగ్ హబ్ – ప్రకృతిలో సాహసాన్ని కోరే వారికి బెస్ట్. కొండలపై నుంచి ఆకాశంలో విహరించే గొప్ప అనుభూతి.