టార్డిగ్రేడ్

సైన్స్ ఫిక్షన్ లో కాదు, నిజంగానే ఈ సూక్ష్మ జంతువు ఖాళీ అంతరిక్షంలో, హిమాలయాల్లో, ఇలా అనేక రకాల ఉష్ణోగ్రతల్లో బ్రతుకుతుంది!

యాక్టిక్ ఫిష్ 

ఈ చేప రక్తంలో హీమోగ్లోబిన్ లేదు. కానీ నీటిలో జీవిస్తుంది. మరింత చల్లదనాన్ని తట్టుకునే ప్రత్యేక నెమ్మదైన జీవక్రియ ఉంది. 

క్యామెల్  

ఒకసారి నీరు తాగిన తర్వాత 18 రోజులు ఎండలో నడుస్తుంది. ఇసుక మైదానాల్లో దీనికి ప్రత్యర్థే లేదు!

పోమ్‌పీ వార్మ్ 

ఈ కీటకం 80°C పైన వేడి ఉన్న సముద్రపు లోతుల్లో జీవిస్తుంది. అతి వేడి నీటిలో కూడా ఇది జీవించగలదు. 

యాక్   

హిమాలయాల్లో గాలి తక్కువగా ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా బ్రతికే గొర్రెలాంటి జీవి 

అంటార్కిటిక్ బగ్  

అంటార్కిటికాలో జీవించే కీటకం ఇది. హిమపాతం, గాలులు, మరియు ఉష్ణోగ్రత -40°C అయినా జీవించగలదు. 

నెమలి కందిరీగ 

సహారాలో వేడి, మంచు ఎక్కడైనా ఉంటూ, ఏడాదిలో కొన్ని నెలలు ఆహారం లేకుండా కూడా ఇది బ్రతికేస్తుంది.

బారెల్ ఐ ఫిష్ 

ఈ చేప లోతైన సముద్రాల్లో పూర్తి చీకటిలో జీవిస్తుంది. దాని తల పారదర్శకంగా ఉంటుంది – కళ్ళు తలలోనే కనిపిస్తాయి!

వుడ్ ఫ్రాగ్  

ఈ కప్ప శీతాకాలంలో పూర్తిగా గడ్డకట్టిపోతుంది. వసంతంలో మళ్లీ కరిగి జీవితం తిరిగి ప్రారంభిస్తుంది!

ఎలిగేటర్ 

చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, ముక్కు నీటి బయట పెట్టి, హైబర్నేషన్ లోకి వెళ్తుంది – చాలా రోజులు కదలకుండా బ్రతుకుతుంది.