స్విట్జర్లాండ్ - జర్మాట్

ఆల్ఫ్స్ పర్వతాల్లోనున్న ఈ హిల్ టౌన్, మాటర్‌హార్న్ పర్వత దృశ్యాలతో పరవశింపజేస్తుంది. స్కీయింగ్, హైకింగ్‌కు ఇదొక పరవశ కేంద్రము.

జపాన్ - హకోనే  

ఫుజి పర్వతాన్ని దగ్గరగా చూడగల ఈ ప్రాంతం హాట్ స్ప్రింగ్స్, తూర్పు సంస్కృతితో ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది.

ఇండియా - మనాలి

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, హిమాలయాలలో హైకింగ్, స్నోఫాల్ కోసం వచ్చే ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం లాంటిది. 

న్యూజిలాండ్ - క్వీన్‌స్టౌన్ 

పర్వతాల మధ్యలో ఉన్న ఈ టౌన్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ప్రశాంతమైన సరస్సులతో ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం 

ఇటలీ - డోలమైట్స్  

యునెస్కో వారసత్వ ప్రదేశమైన ఈ పర్వతాలు, స్కీయింగ్, ట్రెక్కింగ్, ఫోటోగ్రఫర్స్ కి అద్భుత అనుభూతిని ఇస్తాయి.

నేపాల్ - పూఖరా

అన్నపూర్ణ పర్వత శ్రేణిని తిలకించే వీలు కలిగించే ఈ ప్రాంతం, ప్రశాంతత, సహజ అందాలకు నిలయం.

కెనడా - బాన్‌ఫ్ నేషనల్ పార్క్ 

ఒక నిజమైన వండర్‌ల్యాండ్. పర్వతాలు, సరస్సులు, అడవులు – ఇక్కడ ప్రతి మూల చిన్న చిత్రపటంలా ఉంటుంది.

ఆస్ట్రియా - హాల్‌స్టాట్  

ఆల్ప్స్ పర్వతాల ఒడిలో ఉన్న ఈ పురాతన గ్రామం సరస్సు, కొండల మధ్య ఆదర్శవంతమైన సుందరత్వాన్ని అందిస్తుంది.

చిలీ - పాటగోనియా

అవిశ్రాంతమైన గ్లేషియర్లు, అడవులు, పర్వతాలు కలగలిపిన పాటగోనియా ప్రకృతి ప్రేమికుల కలలు నెరవేరే ప్రదేశం

నార్వే - గెయిరాంగర్ ఫియోర్డ్ 

ఉత్తమ నార్వేజియన్ ఫియోర్డ్‌లలో ఒకటైన ఇది, నీళ్ల జలపాతాలు, కొండల నడుమ ప్రశాంతతకు ప్రసిద్ధి.