ఫిన్‌లాండ్

ఉచిత విద్య, ఆరోగ్య పరిరక్షణ, ప్రకృతి ప్రేమ – ఇవన్నీ ఫిన్‌లాండ్‌ను వరుసగా 7వ సంవత్సరం కూడా ప్రపంచంలో నెంబర్ 1 గా నిలిపాయి.

డెన్మార్క్ 

స్వేచ్ఛ, సమానత్వం, ప్రజల మధ్య నమ్మకం, నిఖార్సైన జీవన ప్రమాణాలు డెన్మార్క్‌ ప్రజలను ప్రతి రోజు నవ్వుతూ జీవించేటట్లు చేస్తాయి.

ఐస్లాండ్ 

ప్రకృతి అందాలు, పరిశుభ్రమైన గాలి, తక్కువ క్రైం శాతం, బలమైన సామాజిక సంబంధాలు ఐస్లాండ్‌ను సంతోష భరిత దేశంగా నిలబెడతాయి.

స్వీడన్ 

హై లెవెల్ హెల్త్ సర్వీసెస్, వర్క్ లైఫ్ బ్యాలన్స్, మోరల్ వ్యాల్యూస్ స్వీడిష్ ప్రజల సంతోషానికి కారణాలు.

ఇజ్రాయెల్ 

టెక్నాలజీలో పురోగతి, బలమైన కుటుంబ వ్యవస్థ, చురుకైన జీవనశైలి, సామాజిక భద్రత – ఇవన్నీ ఇజ్రాయెల్ ప్రజల సంతోషాన్ని పెంచుతాయి.

నెదర్లాండ్స్  

ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన ఆహారం, స్వేచ్ఛాభిప్రాయం – ఇవి నెదర్లాండ్స్‌ను ఒక హ్యాపీనెస్ హబ్‌గా మార్చాయి.

నార్వే  

ప్రకృతి ప్రేమ, అధిక ఆదాయం, సమానత్వం మరియు ప్రజల మధ్య నమ్మకం వంటి కారణాలే నార్వేలో జీవితం ఆనందదాయకంగా మార్చాయి. 

లక్సెంబర్గ్

చిన్న దేశం అయినప్పటికీ అధిక జీవన ప్రమాణాలు, చక్కటి సామాజిక రక్షణ పథకాలు లక్సెంబర్గ్‌ను సంతోషకర దేశంగా నిలబెడతాయి.

స్విట్జర్లాండ్  

పర్వతాల అందం, తేలికపాటి జీవనం, అత్యున్నత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రజల హ్యాపీ లైఫ్‌కు బలమైన ఆధారం. 

ఆస్ట్రేలియా 

ఉన్నత స్థాయి విద్యా, ఆరోగ్య సేవలు, ప్రకృతి అందాలు, ఆటల ప్రాధాన్యం – ఇవన్నీ ఆస్ట్రేలియన్లను ఉల్లాసంగా జీవించేందుకు సహాయపడతాయి.