ఆంధ్రప్రదేశ్ – బంగినపల్లి

ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండవ అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారు. ఇక్కడ బంగినపల్లి మామిడికాయలు ఎంతో ఫేమస్. ఇవి తీపిగా, గుజ్జుతో నిండినవిగా ఉంటాయి.

ఉత్తరప్రదేశ్ – దసెహరి 

ఉత్తరప్రదేశ్‌ దేశం మామిడి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. దసెహరి మామిడికాయలు చిన్నవి. ఇవి మృదువుగా, మధురంగా, ప్రత్యేక సువాసన కలిగి ఉంటాయి. 

మహారాష్ట్ర – హాపుస్

మహారాష్ట్రలోని రత్నగిరి హాపుస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనికి మధురమైన రుచి, మృదుత్వం, అరుదైన సువాసన ఉన్నాయి.

గుజరాత్ – కేసర్

గుజరాత్‌లో జూనాగఢ్‌ ప్రాంతంలో ఉత్పత్తయ్యే కేసర్ మామిడికాయలు మధురంగా, నారింజ రంగుతో ఆకట్టుకుంటాయి. ఎక్కువశాతం ఇవి ఎగుమతులకు అనువైనవిగా ఉంటాయి.

బీహార్ – జార్జ్

బీహార్‌లో పుట్టిన జార్జ్ మామిడికాయలు పూర్తిగా గుజ్జుతో, రుచికి మధురంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా భోజనంతోపాటు తినడానికి బాగా వాడతారు. 

తెలంగాణ – హిమాయత్ 

తెలంగాణ రాష్ట్రంలో హిమాయత్ మామిడి ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద పరిమాణంలో ఉండే మామిడికాయ. ఎంతో రుచి కలిగి ఉంటుంది. దీని సుగంధం ప్రత్యేకంగా ఉంటుంది. 

పశ్చిమ బెంగాల్ – హిమ్సాగర్

పశ్చిమ బెంగాల్‌లో హిమ్సాగర్ మామిడికాయలు మధురంగా, తేమగా ఉండి, ముక్కలు లేకుండా పూర్తిగా గుజ్జుతో నిండివుంటాయి.

కర్ణాటక – సిందూరా

కర్ణాటకలో సిందూరా మామిడి విస్తారంగా ఉత్పత్తి అవుతుంది. వీటికి ఆకర్షణీయమైన రంగు, మధురత ఉండి, రసం తాగడానికి చాలా అద్భుతంగా ఉంటాయి.

తమిళనాడు – ఇమాంపసంద్ 

తమిళనాడు రాష్ట్రంలోనూ ఇమాంపసంద్ మామిడికాయలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మృదుత్వంతో, మధురతతో ఉన్న వీటికి ప్రీమియం మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ.

ఒడిశా – మల్లికా 

ఒడిశాలో మల్లికా రకం మామిడికాయలు ఉత్పత్తి అవుతాయి. వీటి రుచి మధురంగా ఉంటుంది. నారింజ రంగుతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఇవి మిక్స్‌డ్ రకాల్లో ఓ బెస్ట్.