అగ్గుంబె – కర్ణాటక

ముసురు మబ్బుల్లో కప్పబడిన అగ్గుంబె, భారతదేశంలోనే అతిపెద్ద వర్షపాతం గల ప్రదేశం. ఎప్పటికీ ఆకర్షించే హిల్స్, జలపాతాలు, ఇంకా తేమతో నిండిన అటవీ ప్రాంతాలు మనసుని హత్తుకొంటాయి.

అరకు లోయ – ఆంధ్రప్రదేశ్ 

మాన్ సూన్ సీజన్‌లో పొదలతో నిండే అరకు లోయ, తడిచిన కాఫీ ఎస్టేట్స్‌తో ఎంతో హాయిగా మారుతుంది. బొర్రా గుహలు, జలపాతాలు ఇక్కడి అదనపు ఆకర్షణలు 

పల్లకాడ్ – కేరళ

పచ్చని దుప్పటి పరుచుకొన్న పొలాలు, ఎత్తైన కొండలు, వర్షం జల్లులు... పల్లకాడ్ అంటే ప్రకృతితో మమేకమైన జీవితం. ఈ ప్రాంతం వర్షకాలంలో విశేషంగా నచ్చుతుంది 

యానాం – పుదుచ్చేరి

గోదావరి నదీ తీరంలో ఉన్న చిన్న ఫ్రెంచ్ టౌన్ అయిన యానాం, వర్షంలో మాయమవుతుంది. వృక్షావళి, సంప్రదాయమైన గుడులు దీనికి ప్రత్యేక ఆకర్షణ.

కొడగు – కర్ణాటక

కాఫీ తోటలు, కొండలు, వర్షపు మబ్బులు కలిసే కొడగు, మనసుకి మత్తెక్కించే రొమాంటిక్ డెస్టినేషన్. అక్కడి మూడ్ నిజంగా మైమరిపిస్తుంది.

వయనాడ్ – కేరళ 

చుట్టూ కొండలు, పచ్చని టీ లాండ్‌స్కేప్స్, జలపాతాలు, సరస్సులు, దట్టమైన అడవులు ఉండే వయనాడ్, హృదయాన్ని తడిపేసే అసలైన మాన్సూన్ గేట్వే 

బద్రాచలం – తెలంగాణ

గోదావరి నది ఒడ్డున ఉన్న పవిత్ర నగరం బద్రాచలం, వర్షంలో ఇంకా అందంగా కనిపిస్తుంది. ప్రకృతి, భక్తి కలయికతో పునీతమైన అనుభవం ఇది.

నల్లమల అటవీ ప్రాంతం – ఆంధ్ర & తెలంగాణ

వర్షకాలంలో ఈ అడవులు ఆకుపచ్చగా మారి జంతువులతో నిండిపోతాయి. అడవిలో వర్షం అనుభూతి వేరే లెవెల్‌లో ఉంటుంది.

కొల్లం – కేరళ

అష్టముడి బ్యాక్‌వాటర్స్‌తో కొల్లం, మాన్ సూన్ వర్షాలలో మెరిసిపోతుంది. బోట్ రైడ్స్, వర్షపు జల్లు కలిస్తే అసలు వదలలేరు.

హంపి – కర్ణాటక

చరిత్రతో నిండిన హంపి రాళ్లు వర్షంలో తడిసి చీకటి వెలుతురు కలగలిసినట్టు కనిపిస్తాయి. మాన్సూన్ సీజన్ పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే సమయం