నయాగరా జలపాతం ప్రపంచపు ప్రసిద్ధమైన జలపాతం. అద్భుతమైన శబ్దంతో, భారీ ఫోర్స్ తో పడే నీళ్లు ఈ ప్రదేశం టూరిస్టులకు ప్రియమైనది.
విక్టోరియా ఫాల్స్ – ఆఫ్రికా
జాంబియా, జింబాబ్వే దేశాల మధ్య విస్తరించి ఉన్న ఈ జలపాతం "మోసి-ఓ-తున్యా" అంటే “గర్జించే పొగ” గా పేరుగాంచింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది.
ఐగ్వాసు ఫాల్స్ – బ్రెజిల్ & అర్జెంటీనా
275 చిన్న పెద్ద జలపాతాల సమాహారంగా ఉండే ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికుల కలల ప్రదేశం. ఇది నేషనల్ పార్క్ మధ్యలో ఉంటుంది.
ఏంజెల్ ఫాల్స్ – వెనిజులా
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం. 979 మీటర్ల ఎత్తు నుండి పడే నీరు కనుల పండుగగా ఉంటుంది. అడవుల్లో ఉన్న రహస్య జలపాతం ఇది.
గుల్ఫోస్ – ఐస్లాండ్
ఐస్లాండ్లోని గుల్ఫోస్ జలపాతం రెండు దశల్లో కప్పుకున్న నీటి ప్రవాహంతో అద్భుతంగా కనిపిస్తుంది. చుట్టూ మంచు మరియు కొండలు దీని ప్రత్యేక ఆకర్షణ.
ప్లిట్విస్ ఫాల్స్ – క్రోయేషియా
విలక్షణమైన కలర్‌ఫుల్ నీటితో ఆకట్టుకునే ఈ జలపాతాలు ప్లిట్విస్ నేషనల్ పార్క్‌లో ఉన్నాయి. బ్లూ-గ్రీన్ కలర్ వాటర్ ఇక్కడి విశేషం.
డెట్టిఫోస్ – ఐస్లాండ్
యూరోప్‌లోని శక్తివంతమైన జలపాతంగా పేరొందిన డెట్టిఫోస్, పర్వతాల మధ్య భారీగా ప్రవహిస్తుంది. ఫోటో గ్రాఫర్లకు ఇది ఓ మాస్టర్ పీస్.
సెల్యాలాండ్స్ ఫాస్సు – ఐస్లాండ్
ఈ జలపాతాన్ని వెనుక నుంచి నడిచి చూడవచ్చు. సూర్యాస్తమయంలో ఈ ప్రదేశం అద్భుతంగా మెరుస్తుంది. ఫోటోల కోసం ఆదర్శవంతమైన ప్రదేశం.
బాన్ జలపాతం – చైనా
వియత్నాం సరిహద్దులో ఉన్న ఈ జలపాతం నుండీ మూడు స్థాయిలలో నీరు కింద పడుతుంది. పచ్చని కొండల మధ్య దీని అందం మనోహరంగా ఉంటుంది.
యోసెమైట్ ఫాల్స్ – USA
యోసెమైట్ నేషనల్ పార్క్‌లో ఉన్న ఈ జలపాతం అమెరికాలోనే ఎత్తైనది. వసంతకాలంలో ఇది పూర్ణ రూపంలో దర్శనమిస్తుంది.