ఉదయ్ పూర్, రాజస్తాన్

ప్యాలెస్‌లు, లేక్స్, రాయల్ ఫీల్ కోసం ఉదయ్ పూర్ బెస్ట్. జగ్ మందిర్‌లో డ్రీమ్ వెడ్డింగ్ చేయవచ్చు. ఫోటోలకు పర్ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్!

గోవా

బీచ్ వెడ్డింగ్ అంటే గోవా తప్పనిసరి. సూర్యాస్తమయంలో సముద్రతీరాన వివాహం కలలాంటిది. మ్యూజిక్, డాన్స్‌తో ఫుల్ ఎంజాయ్‌మెంట్ మూమెంట్ ఇది.

కేరళ

బ్యాక్ వాటర్స్, హౌస్‌బోట్స్‌తో ప్రశాంతమైన వెడ్డింగ్ కోసం కేరళ బెస్ట్ ఆప్షన్. పచ్చని ప్రకృతి మధ్య మీ ప్రేమకథ మరిచిపోలేనిదిగా మారుతుంది.

జైపూర్

పింక్ సిటీ జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే రాచరికం. అంబర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్‌లు మీ వెడ్డింగ్‌ను గ్రాండియస్‌గా మారుస్తాయి. 

ముస్సోరీ, ఉత్తరాఖండ్ 

హిమాలయాల మధ్య వింటేజ్ స్టైల్ వెడ్డింగ్ కావాలంటే ముస్సోరీకి వెళ్లండి. చల్లని వాతావరణం, మిస్టీ లుక్స్ ఫొటోలకు అదుర్స్!

అండమాన్ ఐలాండ్స్ 

తెల్లని ఇసుకలు, నీలి సముద్రం మధ్య వెడ్డింగ్ అంటే ఇది నిజంగా స్వర్గమే! ప్రైవేట్ బీచ్‌లు ప్రత్యేక అనుభూతి ఇస్తాయి.

లేవ్‌లాక్, కశ్మీర్

పూసిన పువ్వులాంటి కశ్మీర్‌లో పెళ్లి అంటే ఫిల్మీ ఫీల్. పహల్గాం, గుల్మార్గ్ వంటి ప్రదేశాల్లో స్వర్గపు అనుభూతి కలుగుతుంది.

అలీబాగ్, మహారాష్ట్ర

ముంబయికి సమీపంలో ఉన్న అలీబాగ్ బీచ్‌లు రివాజ్, స్టైల్ కలబోత.  ఇక్కడి ప్రైవేట్ విల్లాల్లో మసాలా వెడ్డింగ్ చేయొచ్చు.

రిషికేశ్

గంగానది ఒడ్డున శాంతియుత హిందూ సంప్రదాయ వివాహం చేయాలంటే రిషికేశ్ బెస్ట్. సాంప్రదాయంతో సహజసిద్ధత కలిపిన బెస్ట్ డెస్టినేషన్.