బింటురాంగ్

బింటురాంగ్ అనేది ఓ అరుదైన ఆసియా జంతువు.  ఇది "బేర్‌క్యాట్"గా పాపులర్ అయింది. చెట్లపైకి ఎక్కగలదు. దాని శరీరం నుండి పాప్‌కార్న్ వాసన వస్తుంది.

బ్లూ డ్రాగన్ 

బ్లూ డ్రాగన్స్ అనేది “నుడిబ్రాంచ్” అని పిలువబడే ఒక రకమైన మొలస్క్. కానీ, రంగురంగుల పక్షిలా కనపడుతుంది,  ఇది రూపంలో చిన్నదే కానీ,  అద్భుత జీవి.  

బిల్బీ

ఆస్ట్రేలియాలో కనిపించే బిల్బీ అనే చిన్న జీవి రూపంలో నక్కను పోలి ఉంటుంది. దీని చెవులు పెద్దవిగా ఉండి, గూడు త్రవ్వడంలో దిట్ట.

బాబిరూసా

ఇండోనేషియాలో కనిపించే బాబిరూసాలు గొంతులోంచి పైకి మొలిచిన పళ్ళతో కనిపిస్తాయి. ఇవి వింతగా ఉండే అడవి పంది జాతికి చెందినవి.

బ్లూ ఫుటెడ్ బూబీ   

ఈ పక్షికి ఆకట్టుకునే బ్లూ కలర్  ఫీట్ ఉంటాయి. ఇవి గాలాపగోస్ దీవుల్లో కనిపిస్తాయి. ఈ బర్డ్ చేసే డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.

బాస్కింగ్ షార్క్

ఈ బాస్కింగ్ షార్క్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద చేప. ఇది మానవులకు హానికరం కాదు. కానీ, తెరిచి ఉండే పెద్ద నోరుతో జలచరాలను తింటుంది.

బ్యాట్ ఈయర్డ్ ఫాక్స్

ఈ నక్కకి గొప్ప శ్రవణశక్తి కలిగిన పెద్ద చెవులు ఉంటాయి. ఇవి ఆఫ్రికాలో కనిపిస్తాయి. చిన్న జంతువులను పట్టుకుని తింటాయి. 

బియార్డెడ్ పిగ్     

ముక్కు చుట్టూ గడ్డం ఉన్నట్లు కనిపించే బియార్డెడ్ పిగ్                  బోర్నియోలో కనిపిస్తుంది. అడవిలో తృణధాన్యాలు తిని ఇది జీవిస్తుంది.

బ్లూ ఇగ్వానా 

బ్లూ రంగులో ఉండే ఈ ఇగ్వానా గ్రాండ్ కేమన్ ద్వీపంలో మాత్రమే కనిపిస్తుంది. ఇది అంతరించిపోయే అరుదైన జంతువుల్లో ఒకటి.

బొనోబో

బొనోబో మానవులకి అత్యంత సమీప బంధువు. ఇవి చింపాంజీల వంశానికి చెందినవి. మృదువైన స్వభావం కలిగి ఉండి, సామూహికంగా జీవిస్తాయి.