ఆండియన్ కాండోర్

దక్షిణ అమెరికాలో కనిపించే ఈ పక్షి 10 అడుగుల పొడవైన రెక్కలు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగిరే పక్షిగా గుర్తింపు పొందింది.

హార్పీ ఈగిల్ 

దక్షిణ అమెరికా అడవుల్లో ఉండే ఈ ఈగిల్ 3.5 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. ఆహారం కోసం దాని శక్తివంతమైన పంజాలతో మంకీలు, స్లోత్స్‌ను పట్టుకుంటుంది.

డాల్మేషియన్ పెలికాన్

ఈ పెద్ద పెలికాన్ 6 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. పొడవాటి కొనదేలిన దీని పెద్ద బీక్ ద్వారా నీటిలోకి దిగినప్పుడు ఒకేసారి ఎక్కువ చేపలను లోపలికి తీసుకొంటుంది. 

ఆస్ట్రిచ్  

ఆఫ్రికన్ బ్రీడ్ అయిన ఆస్ట్రిచ్ ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. ఇది ఎగరలేదు కానీ 9 అడుగుల ఎత్తు, 150 కిలోల బరువు కలిగి ఉంటుంది.

ఈము 

ఆస్ట్రేలియాలో ఉండే ఈ రన్నింగ్ బర్డ్ సుమారు 6 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎగరలేదు కానీ,  వేగంగా పరుగెత్తగలదు.

కాసోవరీ

వెనిజరన్ అడవుల్లో ఉండే ఈ రంగురంగుల పెద్ద పక్షి గాయపరిచేంత ప్రమాదకరమైన పంజాలు కలిగి ఉంటుంది. ఇది 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.  

మరాబౌ స్టార్క్ 

ఆఫ్రికాలో కనిపించే ఈ పక్షి 5 అడుగుల ఎత్తు ఉంటుంది. మరియు పెద్ద పెద్ద రెక్కలు కలిగి ఉంటుంది. 

అల్బట్రాస్ 

ప్రపంచంలోనే అతిపెద్ద రెక్కల విస్తీర్ణం అంటే సుమారు 11 అడుగులు కలిగిన పక్షి. ఇది సముద్రాల్లో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

క్రౌన్డ్ ఈగిల్ 

ఆఫ్రికాలో ఉండే ఈ ఈగిల్ 3 అడుగుల పొడవుతో చిన్న జంతువులను కూడా ఈజీగా తినేస్తుంది. దీని పంజాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. 

ఫిలిప్పైన్ ఈగిల్ 

ఫిలిప్పీన్స్ దేశపు జాతీయ పక్షి. ఇది 3.5 అడుగుల పొడవుతో చాలా బలంగా ఉంటుంది. ఇది మానవుల కంటే కూడా పెద్దదిగా అనిపించగలదు.