మాల్దీవులు

మాల్దీవులకు ఇండియన్ టూరిస్టులకి వీసా అవసరం లేకుండా 30 రోజులు ఉండవచ్చు. అందమైన బీచ్‌లు, నీటి ముంగిట రిసార్ట్స్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు.

నేపాల్

నేపాల్‌కి పాస్‌పోర్ట్ కూడా అవసరం లేదు. భారత్‌కి పొరుగునే ఉన్న ఈ దేశంలో సాహస యాత్రలు, హిమాలయాలు ఆకర్షణీయంగా ఉంటాయి.

భూటాన్

భూటాన్‌కి భారతీయులు వీసా అవసరం లేకుండా ప్రయాణించొచ్చు. హిమాలయ పర్వత ప్రాంతాలు, ప్రశాంతమైన మానసిక వాతావరణం టూరిస్టుల్ని ఆకర్షిస్తుంది.

ఇండోనేషియా

బాలీ వంటి ద్వీపాల వల్ల ఇండోనేసియా పర్యాటకులకు గేట్వేగా ఉంటుంది. భారతీయులకు వీసా అవసరం లేదు, ఇక్కడ 30 రోజుల వరకు వీసా మినహాయింపు ఉంటుంది.

శ్రీలంక 

శ్రీలంకకు ఈటీఏ (ETA) మాత్రమే అవసరం, ఇది వీసా కాదు. చరిత్రాత్మక ప్రదేశాలు, బీచ్‌లు, ఐలాండ్ లైఫ్ కోసం ఇదొక బెస్ట్ డెస్టినేషన్.

ఫిజీ 

ఫిజీని విజిట్ చేయాలనుకొనే భారతీయులకు వీసా అవసరం లేదు. బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, దీవుల ప్రకృతి అందాలు ఇక్కడి ప్రత్యేకత.

సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 

అరేబియన్ సముద్ర తీరంలో ఉన్న ఈ దేశానికి వీసా లేకుండా 30 రోజులు ఉండవచ్చు. ఇక్కడ టూరిస్టులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

సీషెల్స్ 

భారతీయులకు సీషెల్స్‌లో వీసా అవసరం లేదు. కానీ యాక్సెస్ పర్మిట్ తీసుకోవాలి. తెల్లటి ఇసుక తీరాలు, సముద్ర జీవులు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

మిక్రోనేషియా 

ఈ చిన్నదీవుల దేశానికి భారతీయులు వీసా లేకుండా 30 రోజులు ఉండవచ్చు. అద్భుతమైన పర్యాటక సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.

హైతీ 

అరేబియన్ ద్వీపంలో ఉన్న హైతీకి వీసా అవసరం లేదు. 90 రోజుల వరకు ఇక్కడ ఉండవచ్చు. ప్రకృతి ప్రేమికులకు, ఇది మంచి ఎంపిక.