బెంగళూరు

ఐటి హబ్‌గా పాపులర్ అయిన బెంగళూరు, చక్కటి వాతావరణం, విద్యా సంస్థలు, ఉద్యోగ అవకాశాలతో యువతకు మంచి ఆకర్షణీయ నగరం.

పూణె

ఐటీ, ఎడ్యుకేషన్, కల్చర్ కలయికైన పూణే నగరం, పరిశుభ్రమైన వాతావరణంతో యువత, ఉద్యోగులకు నివసించేందుకు ఆదర్శ ప్రదేశంగా మారింది.

హైదరాబాద్

హైటెక్ సిటీగా అభివృద్ధి చెందిన హైదరాబాద్, తక్కువ ఖర్చు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీతో నిండిన క్వాలిటీ లైఫ్ కలిగిన నగరం.

చెన్నై

సాంస్కృతిక వైభవం, వైద్య సదుపాయాలు, వృద్ధులకు అనుకూల వాతావరణంతో చెన్నై ప్రజలు నివసించేందుకు ఓ అద్భుతమైన నగరం.

ముంబయి 

ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబయిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. మెట్రో జీవితం కోరుకునే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక.

అహ్మదాబాద్ 

పరిశుభ్రమైన రహదారులు, క్రమబద్ధమైన అభివృద్ధి, తక్కువ ఖర్చుతో నివసించేందుకు అనుకూలమైన నగరంగా అహ్మదాబాద్ ఎంతో గుర్తింపు పొందింది.

సూరత్

వ్యాపార కేంద్రంగా ఎదుగుతున్న సూరత్, హైజీన్, పీస్ ఫుల్ లైఫ్ వంటివి కోరుకునే కుటుంబాలకు ఉత్తమమైన నగరం. 

జైపూర్ 

రాయల్ సిటీగా పేరొందిన జైపూర్, పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తుంది. నూతన జీవనశైలికి అనువైన మౌలిక సదుపాయాలతో ఆకర్షణీయ నగరం.

కోయంబత్తూరు

ఆరోగ్య సంరక్షణ, విద్యా కేంద్రాలుగా పేరుగాంచిన కోయంబత్తూరు, నివసించేందుకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కలిగిస్తుంది.

ఇండోర్

నెక్స్ట్ జనరేషన్  క్లీన్ సిటీగా నిలిచిన ఇండోర్, కొనసాగుతున్న అభివృద్ధితో జీవన నాణ్యతకు మారుపేరు