రోమ్ నగరపు గర్వం

కొలోస్సియం కేవలం గ్లాడియేటర్ పోరాటాలకే కాదు, రోమ్ నగరానికి ప్రతీక. రోమన్ సామ్రాజ్యపు శక్తిని చూపించే ఓ అద్భుతమైన  నిర్మాణం.

శిల్పకళా మాస్టర్‌పీస్

ఈ నిర్మాణం భూకంపాల ధాటికి తట్టుకొని కూడా శతాబ్దాలుగా నిలబడింది. రోమన్ శిల్పకళ, నిర్మాణ నైపుణ్యం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది.

వేదిక కాదు వినోద కేంద్రం 

ఇది ఇటలీలోని రోమ్ మధ్యలో ఉన్న ఒక పెద్ద ఎలిప్టికల్ యాంఫిథియేటర్. ఇక్కడ నాటకాలు, ప్రదర్శనలు, వన్యప్రాణుల పోటీలు కూడా జరిగేవి.

నీటి పోరాటాల మాయ 

కొన్ని సందర్భాల్లో కోలొస్సియాన్ని నీటితో నింపి, నౌకల పోరాటాల నాటకాలు వేసేవారు. తర్వాత ఈ నావల్ బ్యాటిల్స్ రిజెక్ట్ చేశారు.

సామాజిక స్థితి చూపించే చిహ్నం

సుమారు 50,000 మంది ఆడియెన్స్ కూర్చొనే వీలుండే ఈ థియేటర్లో ధనవంతులు ముందు వరుసలలో కూర్చుండేవారు.

ఉచిత ప్రవేశం, ఉచిత భోజనం

ప్రజల వినోదానికి ప్రభుత్వం ఉచితంగా ప్రవేశం, కొన్నిసార్లు ఉచిత భోజనం కూడా ఇచ్చేది. ఇదంతా ప్రజల మద్దతు కోసమే!

క్రూరతను కూడా చూపించిన చరిత్ర 

గ్లాడియేటర్ పోరాటాలు, వన్యమృగాల వేటలు ఇలాంటివన్నీ రోమన్ సామ్రాజ్యపు మానవత్వం లోపాలను తెలియ చేశాయి.

మధ్యయుగంలో మారిన వినియోగం

సామ్రాజ్య పతనానంతరం కోలొస్సియం ఆదరణ కోల్పోయింది. ఇది ఆలయం, నివాస స్థలం, కోటలా ఇలా అనేక రకాలుగా ఉపయోగించబడింది.

భూకంపాలకి బలైన శిల్పం

కొలొస్సియం కొన్ని భారీ భూకంపాల్లో నష్టపోయినా, మిగిలిన భాగం అంతే నిలిచి పోయింది. ఇది మానవ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం.

యునెస్కో వారసత్వ ప్రాముఖ్యత

కొలొస్సియం ఇప్పుడు యునెస్కో ప్రభుత్వ  వారసత్వ సంపద. ఇది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.