పారిస్ ఈఫిల్ టవర్‌పై ఉన్న "లె జ్యుల్స్ వెర్న్" రెస్టారెంట్లో మీరు ఈఫిల్ టవర్ వ్యూ చూస్తూ రొమాంటిక్ ఫ్రెంచ్ డిన్నర్ ని ఆస్వాదించవచ్చు.
బుర్జ్ ఖలీఫా, దుబాయ్
ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌లోని రెస్టారెంట్ అయిన ఎట్ మాస్ఫియర్ 122వ అంతస్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే దుబాయ్ స్కైలైన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
టోక్యో టవర్, జపాన్
టోక్యో టవర్‌లో ఉన్న రెస్టారెంట్లలో జపనీస్ డిషెస్‌ని ఎంజాయ్ చేస్తూ సిటీ పనోరమిక్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. రాత్రివేళల్లో ఇది మరింత అందంగా ఉంటుంది.
టేబుల్ మౌంటెన్, సౌత్ ఆఫ్రికా
కేప్ టౌన్లో ఉన్న ఈ కొండపైకి కేబుల్ కార్లో వెళ్లి పర్వతశ్రేణుల మధ్య ఉన్న రెస్టారెంట్లో డైనింగ్ చేయొచ్చు.
ద లండన్ ఐ, యూకే
ఈ ఫెర్రీస్ వీల్‌లోని ప్రత్యేక డైనింగ్ కేప్సూల్‌లో మీరు 360 డిగ్రీ లండన్ వ్యూ చూడొచ్చు. ప్రత్యేకంగా లవర్స్ కి ఇది ఆదర్శం.
ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా
లిబర్టీ ఐలాండ్‌పై చిన్న క్యాఫే ఉంది. ఇక్కడ నుంచే లిబర్టీ స్టాట్యూని క్లోజ్ గా చూస్తూ స్నాక్స్, కాఫీ తాగొచ్చు.
పిజా టవర్, ఇటలీ
పిసాలోని పిజా టవర్‌కు సమీపంలోని రెస్టారెంట్లు ఇటాలియన్ ఫుడ్‌తో ఫేమస్ అయ్యాయి. అక్కడుండే వ్యూ మరచిపోలేరు.
పత్రోనాస్ టవర్స్, మలేసియా
కౌలాలంపూర్‌లోని ఈ ట్విన్ టవర్స్‌లో ఉన్న ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు అద్భుతమైన దృశ్యాలని అందిస్తాయి. ఇక్కడి నైట్ లైటింగ్ ఇంకా ఆకట్టుకుంటుంది.
నయాగరా ఫాల్స్, కెనడా
ఇక్కడ నీళ్ల సౌండ్‌తో పాటు నయాగరా వ్యూ చూస్తూ స్పెషల్ రెస్టారెంట్లలో డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరు.
బుర్జ్ అల్ అరబ్, దుబాయ్
ఈ 7 స్టార్ హోటల్లోని అల్ మహారా రెస్టారెంట్ అండర్ వాటర్ లో ఉన్నట్లు కనిపించే డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఇక్కడి డైనింగ్ అనుభూతి మరిచిపోలేరు.