బ్లూ రింగ్ ఆక్టోపస్

ఈ ఆక్టోపస్ కేవలం కొన్ని నిమిషాల్లోనే మనిషిని చంపగలుగుతుంది. దీని విషం నరాలని దెబ్బతీస్తుంది.

బెల్చిర్ సముద్ర పాము 

ఈ పాము విషం కొబ్రాతో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ. ఇవి ఎక్కువగా సముద్ర జలాల్లో కనిపిస్తుంటాయి.

కింగ్ కోబ్రా

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విషసర్పం. ఒకే ఒక్క బైట్ తో ఏనుగుని కూడా చంపగలిగే శక్తి కలిగి ఉంది.  

స్టోన్ ఫిష్

ఈ చేప నీటిలోపల అచ్చం రాళ్లలా కనిపిస్తుంది. దీని కాంతివంతమైన మెడలు విషాన్ని కక్కుతాయి. ఇది తక్షణ మరణానికి దారి తీస్తుంది.

ఇరుకాండ్జి జెల్లీఫిష్

సామాన్య జెల్లీఫిష్ కన్నా చిన్నదైనా, ఇది ఉత్పత్తి చేసే విషం మాత్రం తీవ్రమైన నరాల వేదనకు గురిచేస్తుంది.

ఫన్నల్ వెబ్ స్పైడర్ 

ఈ స్పైడర్ ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. దీని కాటు తక్షణమే హార్ట్ బీటింగ్ పై ప్రభావం చూపిస్తుంది.

డార్ట్ ఫ్రాగ్ 

ఈ రంగురంగుల బుల్లి ఫ్రాగ్ పొరల్లో నుంచి వెలువడే విషం శరీరానికి ప్రమాదకరం. ఈ వెనోమ్ ని ఆయుధాలపై పూయటానికి ఉపయోగిస్తారు. 

కోన్ నత్త

కోన్ ఆకారంలో ఉండే ఈ నత్త విషపూరిత సూది వలె పనిచేస్తుంది. ఆకారంలో చిన్నదైనా ఇది చాలా ప్రాణాంతకం.

డెత్ స్టాల్కర్ స్కార్పియన్

ఈ స్కార్పియన్న విషం నరాల వ్యవస్థను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఇది ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కనిపిస్తుంది.

బాక్స్ జెల్లీఫిష్

ఈ జెల్లీఫిష్ లోని విషం గుండెను ఆపివేస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక సముద్రజీవులలో ఇది కూడా ఒకటి.