ఈస్టర్న్ ఇండిగో స్నేక్
ఇది నీలం నలుపు కలబోతలో మెరిసే పాము. ఫ్లోరిడా, జార్జియాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి విషం ఉండదు, ప్రమాదం కూడా ఉండదు.
రెయిన్బో స్నేక్
ఈ పాము మెరిసే ఎర్రటి గీతలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కువగా నీటి వద్దనే కనిపిస్తుంది.
రఫ్ గ్రీన్ స్నేక్
పచ్చగా కనిపించే ఈ పాము మొక్కల మధ్య దాగి ఉంటుంది. దీని శరీరం సన్నగా, పొడవుగా ఉంటుంది. అంతేకాదు, ఇది మృదువైన ప్రవర్తన కలిగినది.
స్కార్లెట్ స్నేక్
ఎరుపు, తెలుపు, నలుపు రంగుల మచ్చలతో ఉండే ఈ పాము చాలా చిన్నది. ఎక్కువగా నేలలో దాగి ఉంటుంది. అయితే ఇది కూడా విషం లేని పాము.
స్కార్లెట్ కింగ్ స్నేక్
ఈ పాము చూడాటానికి చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంది. ప్రకృతి దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇది విషపామును పోలి ఉంటుంది కానీ విషం ఉండదు.
కార్న్ స్నేక్
నారింజ, ఎరుపు రంగుల్లో ఉండే ఈ పాము చాలా భయంకరంగా కనిపించినా ఎంతో మృదువుగా ఉంటుంది. ఇది చిన్న చిన్న జంతువులను వేటాడుతుంది.
మిల్క్ స్నేక్
ఈ పాము రంగురంగుల బంధాలతో ఉంటుంది. దీని రంగులు కొరల్ పామును పోలి ఉంటాయి, కానీ ఇది హానికరం కాదు.
గార్టర్ స్నేక్
ఈ పాము ఎక్కువగా తోటలలోనే కనిపిస్తుంది. దీని శరీరం మీద పసుపు లేదా ఎరుపు గీతలు ఉంటాయి. ఇది మనిషికి ఎటువంటి హానీ కలిగించదు.
రింగ్‑నెక్ పాము
ఇది మెడ చుట్టూ రంగు ఉంగరం లాగా ఉంటుంది. చిన్నదైనా అందంగా ఉంటుంది. దీని శరీరం నలుపుగా మెరిసిపోతుంది.
కాలిఫోర్నియా మౌంటైన్ కింగ్స్నేక్
తెలుపు, నలుపు, ఎరుపు రంగులు కలిపిన ఈ పాము చూపరులను ఇట్టె ఆకట్టుకుంటుంది. దీనికి విషం లేక పోవటంతో మా
నవులకి ఎలాంటి హానీ తలపెట్టాదు.