అఫ్ఘానిస్తాన్‌లో చాలాకాలం నుంచే తాలిబాన్ ప్రభావం ఉంది. యుద్ధం, ఉగ్రవాదం, మహిళలపై హింస కారణంగా ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశంగా మారింది.
సిరియా
సిరియాలో దశాబ్ద కాలం నుంచీ సాగుతున్న గృహయుద్ధం, బాంబు దాడులు, ఉగ్రవాద కార్య కలాపాలు ప్రజలను ప్రాణభయంతో బతికేలా చేస్తున్నాయి. ఇది టూరిస్టులకి కూడా అంత సేఫ్ కాదు.
దక్షిణ సూడాన్
ఇటీవల స్వతంత్రమైన ఈ దేశంలో పౌరయుద్ధం, ఆకలి చావులు, దోపిడీలు అధికంగా జరుగుతాయి. దీనివల్ల ఇది నివసించడానికి అత్యంత ప్రమాదకరమైన దేశంగా నిలుస్తుంది.
సోమాలియా
సముద్ర నావికులు,, ఉగ్రవాద గ్రూపులు, ప్రభుత్వ లేని పాలన ఇవన్నీ కలిసి సోమాలియాను ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా మార్చాయి.
ఇరాక్
ఇరాక్ లో నిత్యం ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు, రాజకీయ అస్థిరతలు కారణంగా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పర్యాటకులకు ఇది ;ఏమంత సేఫ్ కాదు.
యెమెన్
యెమెన్ లో కొనసాగుతున్న యుద్ధం, హ్యూమనిటేరియన్ సంక్షోభం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. చివరికి ఇక్కడ ఆహారం, నీరు, వైద్యం కూడా అందుబాటులో లేదు.
నైజీరియా
ఉగ్రవాదం, కిడ్నాప్‌లు, దోపిడీలు ఎక్కువగా జరుగుతున్న నైజీరియాలో కొన్ని ప్రాంతాలైతే పూర్తిగా అసురక్షితంగా మారిపోయాయి.
పాకిస్తాన్
ఉగ్రవాద కార్యకలాపాలు, రాజకీయ అస్థిరతలు, దక్షిణ ఏషియాలో పాకిస్తాన్‌ను ప్రమాదకర దేశంగా మార్చాయి. ప్రత్యేకించి బలూచిస్తాన్ ప్రాంతంలో అయితే హింస మరీ ఎక్కువ.
ఉత్తర కొరియా
ఇది ఓ నియంతృత్వ పాలన కలిగిన దేశం. ప్రజలకు స్వేచ్ఛ లేదు, టూరిస్టులకు కూడా తీవ్ర నిబంధనలు ఉంటాయి. చిన్న తప్పు కూడా పెద్ద శిక్షకు దారితీస్తుంది.