ఈ చిన్న కోతి రాత్రివేళల్లో స్పష్టంగా చూడగలదు. పెద్దవైన దాని కళ్లతో శత్రువుల దాడికి ముందే స్పందించగలదు. ఇది సహజంగా ఎలా సాధ్యమైందో తెలియక శాస్త్రజ్ఞులు సైతం ఆశ్చర్యపోతున్నారు!
ఆక్సలొటిల్
ఈ జలచర జీవి కోల్పోయిన తన చేతులు, కాళ్లు, పక్కల భాగాలను తిరిగి ఉత్పత్తి చేసుకోగలదు. ఇది సాధారణ జీవ పరిణామానికి విరుద్ధంగా ఉంది.
బాంబర్డియర్ బీటిల్
ఈ చిన్న పురుగు తన శత్రువులపైకి తన శరీరంనుండీ వేడి రసాయనాలను పేలుస్తూ దాడి చేస్తుంది. రూపంలో ఇది చిన్నదైనా, యుద్ధానికి మాత్రం ఎప్పుడూ సిద్ధమే!
ప్లాటిపస్
బాతు లాంటి ముక్కుతో ఉండే ఈ జీవి సరీసృపం లాగా గుడ్లు పెడుతుంది, కానీ క్షీరదం లాగా పాలు ఇస్తుంది. మగ జీవులకు విచిత్రంగా వాటి వెనుక కాళ్ళపై విషపూరిత ముళ్ళు కూడా ఉంటాయి,
ఇమోర్టల్ జెల్లీఫిష్
ఈ జెల్లీఫిష్ తనని తాను పిల్ల స్థితికి మలుచుకుని మరలా జీవితం ప్రారంభించగలదు. ఇది శాశ్వత జీవితం గల ఓ అద్భుత జీవి!
నార్వాల్
తిమింగలం జాతికి చెందిన ఈ సముద్ర జీవి తల నుండి బయటకు వచ్చిన దంతాన్ని కలిగి ఉంటుంది. ఈ దంతం సుమారు 10 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీనిని ఒక సెన్సార్.లా ఉపయోగిస్తుంది.
గ్లాస్ ఫ్రాగ్
ఈ కప్ప అడుగు భాగం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. లోపల అస్తిపంజరం, శరీర భాగాలు అన్నీ కనిపిస్తాయి. ఇది ప్రకృతి లో మరో అద్భుతం!
మిమిక్ ఆక్టోపస్
ఈ అక్టోపస్ పరిస్థితులని బట్టి ఇతర సముద్ర జీవుల్లా తన ఆకారాన్ని మార్చుకోగలదు. ఇది మాస్టర్ మిమిక్రీ ప్రాణి.