ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్రిడ్జ్ 980 అడుగుల ఎత్తులో ఉంటుంది.ఈ బ్రిడ్జి మీద నడవడమంటే గుండె ధైర్యాన్ని పరీక్షించు కోవటమే!
టర్కీ – పాముక్కలే థర్మల్ పూల్స్
పాలు పోసినట్టున్న తెల్లని రాళ్లు, తాపీగా ప్రవహించే వెచ్చని నీటి వడులు. ప్రకృతి అందించిన స్వర్గధామం ఇది.
అర్జెంటీనా -పెరిటో మోరెనో గ్లేసియర్
ఈ మంచు పర్వతం నిత్యం కదులుతూ పగుళ్లు చిమ్ముతుంది. ఈ దృశ్యం చూస్తే ప్రకృతి శక్తికి అవాక్కవు తారు.
మెక్సికో – సెనోట్ ఏంజెలిటా
ఇక్కడ నీటి క్రింద ఉండే మరో నీటి పొర, ఒక ప్రత్యేకమైన సింక్‌హోల్ పై నుండీ పొగలు రావటం లాంటి దృశ్యంతో భూమి అడుగునే వేరే ప్రపంచమొకటి ఉన్నట్లు కనిపిస్తుంది.
బొలీవియా – సాలార్ డి ఉయుని
ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఇక్కడే ఉంది. వర్షాకాలంలో ఇది అద్దంలా మారి ఆకాశాన్నే ప్రతిబింబిస్తుంది.
ఆస్ట్రేలియా – పింక్ లేక్
ఇది పింక్ కలర్ లో ఉండే సరస్సు. ఈ నీటిలో ఉండే ప్రత్యేకమైన ఆల్గే కారణంగా నీటికి ఈ రంగు వస్తుంది.
ఐస్లాండ్ – అరోరా బొరియాలిస్
ఆకాశాన్ని రంగుల వర్షంతో నింపే ఈ నార్తెర్న్ లైట్స్, ప్రకృతి గీతల విందుగా కనిపిస్తాయి. ఒక్కసారి చూడాలని కలలు కంటారు.