మిరియాలు

జీర్ణశక్తిని పెంచే మిరియాలు కడుపునొప్పికి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజూ ఉదయం తేనెతో కలిపి తీసుకుంటే మెటబాలిజం పెరుగుతుంది.

అశ్వగంధ 

అశ్వగంధ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నిద్రలేమి, ఆందోళన, శక్తిహీనతకి విరుగుడుగా  దీన్ని ఉపయోగించేవారు.

త్రిఫల  

అమలకి, హరితకి, బిభీతకి కలిపిన త్రిఫల జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది. రోజూ రాత్రి తీసుకుంటే డిటాక్స్‌ఫికేషన్ జరుగుతుంది.

తులసి 

తులసి ఆకులు శ్వాస సంబంధిత సమస్యలకు ఓ అద్భుతమైన ఔషధం. దీనితో చేసిన కషాయం ఇమ్యూనిటీని పెంచుతుంది.

హరిద్ర

యాంటీ బయాటిక్ గుణాలు ఉన్న పసుపు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. పటికబెల్లంతో కలిపి తీసుకుంటే రోగనిరోధకత పెరుగుతుంది.

గుగ్గులు 

ప్రాచీన కాలంలో గుగ్గులును కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగించేవారు. ఇవి హృద్రోగాల రిస్క్ తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.

బ్రాహ్మి 

బ్రాహ్మి మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి పెంపుకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగం. రోజూ కొద్దిగా తీసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.