మౌనంగా బాధలను భరిస్తారు

మగవారు చాలా సందర్భాల్లో వాళ్ళ బాధలను లోపలే అణిచి పెట్టుకుంటారు. ఎవరూ అర్థం చేసుకోరని తెలిసి, మౌనంగా ఉంటారు.

కాంఫ్లిమెంట్‌కి లోపలి ఆనందం

ఒక చిన్న కాంఫ్లిమెంట్‌ కూడా మగవారికి చాలా ఆనందం ఇస్తుంది. కానీ వారు ఆ ఆనందాన్ని బయటకు చూపించరు. గర్వంగా భావిస్తారు.

ప్రేమను చూపించడంలో అసహనం

వాళ్లకి ప్రేమ ఉందని తెలుసు కానీ బయటపెట్టడంలో తడబడతారు. భావాలను వ్యక్తపరచడం కష్టం అనే భావన వల్ల అలా ఉంటారు.

భవిష్యత్తుపై ఒత్తిడి

ఫైనాన్షియల్ సెక్యూరిటీ, రెస్పాన్సిబులిటీస్ పై మగవారు ఎప్పుడూ లోలోపల టెన్షన్ పడుతూ ఉంటారు. తామే ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలన్న భావన వారిని తొలిచివేస్తుంటుంది.

కన్నీళ్లను దాచుకుంటారు

ఏ బాధ వచ్చినా, వాళ్లు ఏడవడం తప్పు అనుకుంటారు. కన్నీళ్లు రావాల్సిన చోట కూడా దాచేసుకుంటారు. ఇది వారి మానసిక బలహీనతగా మారుతుంది.

కంపేర్ చేయబడటమే బాధ 

ఇతరుల కంటే తాము తక్కువగా ఉన్నామేమో అనే ఫీల్ వారిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్కమ్, బాడీ షేప్  వంటి అంశాల్లో కంపేరింగ్ నచ్చదు. 

మౌన ప్రేమికులు

ఒక అమ్మాయిని నిజంగా ప్రేమించినా, మగవారు చాలాసార్లు చెప్పలేకపోతారు. తగిన సమయం కోసం ఎదురు చూసే లోపే వాళ్ల లవ్ ఫెయిల్ అవుతుంది.

సన్నిహిత మిత్రుడి అవసరం 

ఒక నిజమైన మిత్రుడు లేకపోతే, మగవారు ఒంటరితనంతో బాధపడతారు. బయటకి బలంగా కనిపించినా, లోపల వారికీ స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి.