లోపల ప్రపంచం అనే సిద్ధాంతం
కొంతమంది శాస్త్రవేత్తలు "హోలో ఎర్త్ థియరీ" ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి లోపల ఖాళీ స్థలం ఉంది, అక్కడ జీవులూ ఉన్నాయి.
ఉత్తర దక్షిణ ధ్రువాల్లో రహస్య గుహలు
కొంతమంది ట్రావెలర్స్ ధ్రువాల దగ్గర భూమిలోకి వెళ్లే గుహలున్నాయని చెబుతారు. కొన్ని ఫోటోలు, పురాతన కథనాలు దీన్ని ధృవపరుస్తున్నాయి.
లోపల ఉండే నాగలోకం కథ
పురాణాల ప్రకారం భూమి లోపల నాగలోకం ఉంటుంది. అక్కడ సర్పాలు నివసిస్తాయి. ఇది భారతీయ పురాణాల్లో ప్రస్తావించబడింది
నాజీల రహస్య ప్రయోగాలు
సెకండ్ వరల్డ్ వార్ సమయంలో నాజీలు భూమి లోపల రహస్య ప్రదేశాలను వెతకారట. వారు అక్కడ కొన్ని ప్రయోగాలు చేశారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.
శాస్త్రవేత్తల నమ్మకాలు
శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు. భూమి లోపల ఖచ్చితంగా లోహాలున్నాయని భౌగోళిక పరిశోధనలు స్పష్టంగా తెలుపుతున్నాయి.
జూల్స్ వెర్న్ కథాపాత్ర ప్రభావం
"Journey to the Center of the Earth" వంటి నవలలు ఈ ఊహకు ప్రేరణ కలిగించాయి. కల్పిత కథలు నిజమయ్యే అవకాశం లేదు.
నిజం ఏమిటి?
భూమి లోపల మరో ప్రపంచం లేదన్నదే శాస్త్రీయ సమాధానం. కానీ కల్పనలకు ఎల్లలు లేవు కాబట్టి ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.