రహస్య గ్రంథం గుర్తింపు
ఇటలీలో 500 ఏళ్ల క్రితం రాసిన ఓ పుస్తకం లభ్యమైంది. అయితే, దాని భాష, లిపి, కోడింగ్ ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.
పుస్తకం పేరు
ఈ గ్రంథాన్ని “Voynich Manuscript” అని పిలుస్తారు. ఇది 1912లో విల్ఫ్రిడ్ వోయినిచ్ అనే వ్యక్తి ద్వారా కనుగొనబడింది.
తెలియని భాషలో రచన
ఈ పుస్తకం పూర్తిగా తెలియని భాషలో రాసి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భాషా నిపుణులు దీన్ని డీకోడ్ చేయలేక పోతున్నారు.
వింతైన చిత్రాలు
ఇందులో వింత మొక్కలు, గ్రహాల ఆకారాలు, అర్థంకాని శాస్త్రీయ చిత్రాలు ఉన్నాయి. ఇవి అసలేమిటో ఎవరూ చెప్పలేరు.
AI టెక్నాలజీ వినియోగం
AI, డీప్ లెర్నింగ్ టెక్నాలజీ వినియోగించినా కూడా ఈ పుస్తకంలోని భాషను డీకోడ్ చేయలేకపోయారు
గూఢచారుల కోణం
కొంతమంది భావన ప్రకారం ఇది పురాతన గూఢచారి కోడ్ కావచ్చని అనుకుంటున్నారు. కానీ దానికి ఆధారాలు లేవు
ఔషధ సమాచారం?
పుస్తకంలోని కొన్ని భాగాలు ఔషధ మొక్కల మీద ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. కానీ స్పష్టత లేదు.
అసలిది ఫేక్ పుస్తకమా?
ఇది అసలు అర్థం కాని విధంగా రాసిన ఫేక్ బుక్ అయి ఉండొచ్చని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.
ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది
500 సంవత్సరాలు గడిచినా ఈ పుస్తకం ఏమి చెబుతోందో ఎవరూ కనుక్కోలేకపోతున్నారు. ఇది ఓ అజ్ఞాత మిస్టరీ
ఈ బుక్ లోకానికే ఓ సవాల్
ఇది ఇప్పటికీ ప్రపంచంలోని పెద్ద భాషా మిస్టరీగా నిలిచింది. దీన్ని ఎవరు చదవగలరో అనేది ఉత్సుకత కలిగిస్తోంది.