ఆక్సోలోట్ల్

ఆక్సోలోట్ల్ మెక్సికోలో మాత్రమే కనిపించే సాలమండర్ జాతి. ఈ జీవి కోల్పోయిన తన అవయవాలను మళ్ళీ తిరిగి పెంచుకునే ప్రత్యేకత కలిగి ఉంది. అందమైన, ఆకర్షణీయమైన రూపం దీని సొంతం,

జాగ్వర్

మెక్సికో అడవుల్లో కనిపించే శక్తివంతమైన మాంసాహారి జంతువు జాగ్వర్. ఇది మూడవ అతిపెద్ద పిల్లి జాతిగా గుర్తింపు పొందింది. 

కోటిముండి

కోటిముండి లేదా కోటి అని పిలవబడే ఈ చిన్న జంతువు రకూన్ కుటుంబానికి చెందినది. ఇది మెక్సికో అడవుల్లో తరచుగా కనిపిస్తుంది.

ఓసెలాట్ 

ఈ చిన్న పిల్లి జాతి జంతువు దాని చారలతో చాలా అందంగా ఉంటుంది. ఇది రాత్రివేళల వేటగాడు. మెక్సికో అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. 

మెక్సికన్ రెడ్‌ నీ టరాన్టులాస్

ఇది ఓ స్పైడర్ జాతి. దీనికి ఎరుపు-నలుపు కాళ్లు ఉంటాయి. ఇవి విషపూరితమైనవి కాకపోయినా భయంకరంగా కనిపిస్తాయి. పెంపుడు జంతువుగా కూడా ప్రసిద్ధి. 

గ్రీన్ మకావ్

ఇది రంగురంగుల పక్షి, ప్రధానంగా పచ్చ రంగులో ఉంటుంది. దాని శబ్దాలు మరియు మాటల అనుకరణలో నైపుణ్యం ప్రత్యేకంగా ఉంటుంది. మెక్సికో అడవుల్లో ఉంటాయి.

మెక్సికన్ గ్రే వుల్ఫ్ 

ఇది అత్యంత అపురూపమైన వుల్ఫ్ జాతిలో ఒకటి. చిన్నదైన శరీరాకృతి, నిఖార్సైన భయపెట్టే కళ్ళు కలిగి ఉంటుంది. 

బొబ్క్యాట్

ఈ మాంసాహారి పిల్లి జాతి మెక్సికోలో పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని నడక మరియు వేగవంతమైన వేట ప్రత్యేకంగా ఉంటుంది.

స్పైడర్ మంకీ  

ఇవి పొడవాటి చేతులు, తోకలతో చెట్ల మధ్య ఊగుతూ జీవిస్తాయి. సమూహాల్లో ఉంటూ భోజనం కోసం చెట్లు ఎక్కుతాయి. చాలా చురుకైనవి.

యూనిక్స్ గువానా  

ఇది యూకాటాన్ ప్రాంతానికి చెందిన సరికొత్త రకాల బల్లి. దాని శరీర రంగులు మరియు పొడవు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.