బుటాన్

బుటాన్ దేశంలో డబ్బు కంటే "గ్రాస్ నేషనల్ హ్యాపినెస్" ఎక్కువ. నేచర్ లో జీవించటం, ధ్యానం, సంస్కృతి ఇక్కడ ప్రజలకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

నేపాల్

పేద దేశమైనా, నెపాల్ ప్రజలు కుటుంబ ప్రేమ, ధర్మపరమైన జీవన శైలి వల్ల సంతోషంగా ఉంటారు. ధ్యానం, భక్తి  ఇక్కడ ప్రధానంగా ఉంటుంది.

బురుండి  

ఆఫ్రికాలోని బురుండి ప్రజలు తక్కువ వనరులతో జీవించేవాళ్లే కానీ, పరస్పర సహాయం, సంఘ బంధం వల్ల హ్యాపీగా ఉంటారు.

టాన్జానియా  

ఇక్కడ ప్రజలు ప్రకృతిని ఆస్వాదిస్తారు. డబ్బు తక్కువైనా, కుటుంబం, సంస్కృతిని ప్రేమిస్తూ జీవిస్తారు.

కామరూన్ 

పేద దేశమైనా కామరూన్ ప్రజలు వినయంగా, పరస్పర గౌరవంతో జీవిస్తూ ఆనందంగా ఉంటారు. సంపద కంటే సంబంధాలకే ఇక్కడ విలువ ఎక్కువ.

మాలావి 

ఇక్కడ ప్రజలు తినడానికి సరిపడా లేకపోయినా, సమానత, స్నేహం, సహాయం వంటి విలువలతో సంపూర్ణ ఆనందాన్ని పొందుతారు.

హైటి  

హైటి ప్రజలు వరుస విపత్తులను ఎదుర్కొన్నా, సంగీతం, నృత్యం, కుటుంబం మీద ప్రేమతో జీవితాన్ని ఆనందంగా గడిపేస్తారు. 

లావోస్

లావోస్ ప్రజలు మితమైన జీవనం, గ్రామీణ జీవనశైలి, బౌద్ధమత విలువలతో ఎంతో సంతృప్తి కరమైన జీవితాన్ని గడుపుతారు.

రవాండా 

గతంలో భయానక సంఘటనలు ఎదురైనా, రవాండా ప్రజలు సంయమనంతో, సంఘబంధంతో జీవిస్తూ లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తారు.

ఫిలిప్పైన్స్  

ఫిలిప్పీన్స్ ప్రజలు తుఫాన్లు, సమస్యలు ఎదురైనా తమ స్నేహశీలత, సంగీతాభిమానంతో ఆనందంగా జీవిస్తారు.